Begin typing your search above and press return to search.

నిరూపిస్తే గుండు గీయించుకుంటా -శివాజీరాజా

By:  Tupaki Desk   |   3 Sep 2018 7:45 AM GMT
నిరూపిస్తే గుండు గీయించుకుంటా -శివాజీరాజా
X
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) వివాదం ర‌చ్చ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మా అధ్య‌క్షుడు శివాజీ రాజా నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక క‌థ‌నం ప్ర‌చురించ‌డం సంచ‌ల‌న‌మైంది. అయితే దీనిపై మా క‌మిటీ హుటాహుటీన స‌మావేశం నిర్వ‌హించి శివాజీరాజాని వివ‌ర‌ణ అడిగింది. చిట్టా ప‌ద్దుల్ని ప‌రిశీలించింది. ఈ స‌మీక్షా స‌మావేశంలో శివాజీ రాజా ఏ నిధులు ఎలా ఖ‌ర్చ‌య్యాయి అన్న‌దానిపై వివ‌ర‌ణ ఇచ్చార‌ని నిన్న‌టి రోజున వార్త వెలువ‌డింది.

నేడు అధికారికంగా ఫిలింఛాంబ‌ర్‌ లో జ‌రిగిన `మా` మీడియా సమావేశంలో అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని ఖండించారు. నిధులు దుర్వినియోగం నిరూపిస్తే గుండు గీయించుకుంటాన‌ని స‌వాల్ చేశారు. అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా నిర్వ‌హించిన మా సిల్వ‌ర్ జూబ్లీ ఈవెంట్‌ తో కోటి నిధి వ‌సూలైందని శివాజీరాజా తెలిపారు. మెగాస్టార్ ఈవెంట్ అంటే కోటి మాత్ర‌మే వ‌సూల‌వుతుందా? అన్న మీడియా ప్ర‌శ్న‌కు శివాజీరాజా స‌మాధాన‌మిస్తూ.. కోటి నిధి మాత్ర‌మే మా ల‌క్ష్యం. అంత‌కుమించి వ‌చ్చిన సొమ్ముల గురించి మాకేమీ తెలియ‌ద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. కోటి నిధిని మాత్ర‌మే తాము సేక‌రించామ‌ని తెలిపారు.

మా అసోసియేష‌న్ సొంత భ‌వంతి కోస‌మే ఈ ఈవెంట్ నిర్వ‌హించాం. అమెరికాలో ఈ త‌ర‌హాలో ఒక్క టాలీవుడ్ త‌ప్ప వేరొక ఇండ‌స్ట్రీ ఇలాంటి ఈవెంట్‌ నే చేయ‌లేదు. మ‌రో నాలుగు నెల‌ల్లో మా ఎల‌క్ష‌న్స్ ఉండ‌డం వ‌ల్ల మాపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అంటూ ప్ర‌త్య‌ర్థుల‌పై శివాజీ రాజా ఆరోపించారు. మా అసోసియేష‌న్ సొంత బిల్డింగ్ నిర్మాణం ఈ ఏడాది చేప‌డ‌తామ‌ని తెలిపారు. శివాజీ రాజాపై అభియోగాన్ని హీరో - మా ఉపాధ్య‌క్షుడు శ్రీ‌కాంత్ ఖండించారు. మా న‌టీన‌టుల మ‌ద్ధ‌తు శివాజీరాజాకు ఉంద‌న్నారు. ఈ స‌మావేశంలో బెన‌ర్జీ - ట్రెజ‌ర‌ర్‌ ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.