Begin typing your search above and press return to search.
రూమర్స్ ఖండించిన 'మా' అసోసియేషన్
By: Tupaki Desk | 2 Sept 2018 3:53 PM ISTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నటుడు శివాజీ రాజా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2017-18 సీజన్‌కి ఆయనే అధ్యక్షుడు. అయితే పదవీకాలం ముగియక ముందే ఆయన పదవికి ముప్పు వచ్చిందని, మా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీనియర్ నరేష్ ప్రస్తుతం `మా` కార్యకలాపాల్ని చేతిలోకి తీసుకున్నారని ప్రచారం సాగింది. ఆర్టిస్టుల సంఘం సొమ్ముల్ని తమ వ్యక్తిగత వ్యాపకాలకు ఖర్చు చేశారనేదానిపై ప్రఖ్యాత డెక్కన్ క్రానికల్ ఆర్టికల్ ని ప్రచురించింది.
అయితే శివాజీ రాజా అసోసియేషన్ ఫండ్స్‌ని మిస్ యూజ్ చేశారని వచ్చిన ఆరోపణలొచ్చాయని సదరు కథనం పేర్కొంది. ఇప్పటికే మా ఫండ్‌కి సంబంధించి రికార్డుల పరిశీలన చేశారట. అందులో కొన్ని మిస్సయ్యాయని, 2017లో ఫైల్స్ కనిపించడం లేదని, అలానే జనరల్ బాడీ మీటింగ్ సమావేశాలకు సంబంధించిన వీడియోలు మాయమయ్యాయని ప్రఖ్యాత డెక్కన్ క్రానికల్ ఓ కథనంలో వివరాల్ని అందించింది.
అయితే ఈ వార్తను మా అసోసియేషన్ ఖండించింది. తనపై వచ్చిన ఫిర్యాదులన్నిటికీ మా అధ్యక్షుడు శివాజీరాజా పూర్తిగా క్లారిఫికేషన్ ఇచ్చారు. అలిగేషన్ వచ్చిన నాలుగు గంటల్లోనే అన్నిటికీ ఆయన సమధానమివ్వడంతో నరేష్ అండ్ టీమ్ ఈ వివాదానికి ముగింపు పలికారని తెలుస్తోంది. ఆర్టిస్టుల సంఘం పారదర్శకతపై శివాజీ రాజా వివరణ ఇవ్వడంతో వివాదం సద్ధుమణిగిందని వెల్లడైంది.