Begin typing your search above and press return to search.

వర్మ ఇండస్ట్రీకి చేసిందేమీ లేదు-శివాజీరాజా

By:  Tupaki Desk   |   22 July 2017 3:45 PM IST
వర్మ ఇండస్ట్రీకి చేసిందేమీ లేదు-శివాజీరాజా
X
డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ తదితరుల్ని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తుండంపై సెటైర్లు వేసిన రామ్ గోపాల్ వర్మపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. వర్మ మాటల్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని శివాజా రాజీ అభిప్రాయపడ్డాడు. డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరాలు తెలుసుకోకుండా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వల్ల ఒరిగేదేమీ లేదని.. నోటీసులు అందుకున్న సెలబ్రెటీలకు.. విచారణ చేపడుతున్న అధికారులకు మాత్రమే అన్ని విషయాలూ తెలుసని శివాజీ రాజా అన్నాడు.

సిట్ విచారణ ద్వారా త్వరలోనే నిజనిజాలు వెల్లడవుతాయని.. ఆలోపు ఎవరేం మాట్లాడినా అర్థం ఉండదని.. అబద్ధాలు నిజాలు కావని.. నిర్దోషుల్ని దోషులుగా నిరూపించడం ఎవరికీ సాధ్యం కాదని శివాజీరాజా అభిప్రాయపడ్డాడు. వర్మ ఇండస్ట్రీకి చేసిందేమీ లేదని.. అతడి వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని శివాజీ రాజా అన్నాడు. ఇండస్ట్రీలో మరింత మందికి నోటీసులు అందుతాయా లేదా అనే విషయంలో విచారణాధికారి అకున్ సబర్వాల్ మాత్రమే చెప్పగలరని అతను చెప్పాడు. అకున్ సబర్వాల్ ను మీడియా అమరేంద్ర బాహుబలిలాగా చూపిస్తోందని.. ఆయన్ని పెట్టి రాజమౌళి బాహుబలి-3 తీస్తారేమో అని.. పూరి జగన్నాథ్-సుబ్బరాజులను విచారించినట్లే డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న స్కూలు పిల్లల్ని కూడా విచారిస్తారా అని వర్మ సెటైర్లు గుప్పించిన సంగతి తెలిసిందే.