Begin typing your search above and press return to search.

చెయ్యి కొర‌క‌డం మ‌నుషులు చేసే ప‌నేనా? శివ‌బాలాజీ వైఫ్ సీరియ‌స్

By:  Tupaki Desk   |   11 Oct 2021 2:18 PM GMT
చెయ్యి కొర‌క‌డం మ‌నుషులు చేసే ప‌నేనా? శివ‌బాలాజీ వైఫ్ సీరియ‌స్
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల ప్ర‌హ‌స‌నం ముగిసింది. ప్ర‌కాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొంది మా అధ్యక్ష ప‌ద‌విని చేప‌ట్టారు. విష్ణు ప్యానెల్ నుంచి గెలిచిన శివ బాలాజీ ట్రెజ‌ర‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

అయితే ప‌ద‌వి మాటేమో కానీ అత‌డి చెయ్యి ప‌ట్టుకుని న‌టి హేమ కొరికేయ‌డం ట్రెండింగ్ అయ్యింది. పోలింగ్ కేంద్రం వ‌ద్ద‌ తాను వెళ్తున్న స‌మ‌యంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని తప్పుకోమంటే తప్పుకోలేదని ఆ గ‌డ‌బిడ‌లో చేయి కొరకాల్సి వచ్చిందని హేమ తెలిపారు. అయితే ఆయ‌న చెయ్యి కొర‌క‌డంపై శివ‌బాలాజీ భార్యామ‌ణి మ‌ధుమిత స్పందించారు.

చెయ్యి కొర‌క‌డాలు లాంటి పనులు మనుషులు మాత్రం చేయరు. ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేను.. అని ఆమె అన్నారు. నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ల గెలుపు ఖాయం అవుతుంద‌ని నిరూప‌ణ అయ్యింద‌ని భ‌ర్త‌కు కితాబిచ్చారు.

మా ఎన్నిక‌ల్లో గెలుపొందిన వారి వివ‌రాలిలా ఉన్నాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు ..ప్రధాన కార్యదర్శిగా రఘు బాబు.. ట్రెజ‌ర‌ర్ గా శివ బాలాజీ..ఉపాధ్యక్షుడిగా బెనర్జీ.. మ‌రో ఉపాధ్యక్షుడుగా శ్రీకాంత్ ..జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ ఎన్నిక‌య్యారు. ఈసీ సభ్యులు గా ఖయ్యూమ్-.శివ రెడ్డి-బ్రహ్మజీ-కౌశిక్-సురేష్ కొండేటి-సంపూర్ణేష్ గెలుపొందారు.