Begin typing your search above and press return to search.

మాస్టర్ కాంప్లిమెంట్: బన్నీనే బెస్ట్ డ్యాన్సర్

By:  Tupaki Desk   |   6 Feb 2018 4:30 AM GMT
మాస్టర్ కాంప్లిమెంట్: బన్నీనే బెస్ట్ డ్యాన్సర్
X
దక్షిణాదిన లెజెండరీ స్టేటస్ అందుకున్న డ్యాన్స్ మాస్టర్లలో శివశంకర్ ఒకడు. గత కొన్నేళ్లలో డ్యాన్స్ షోలకు వచ్చి కామెడీలు చేయడం వల్ల ఆయన విలువ కొంచెం పడిపోయింది కానీ.. నిజానికి ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ డ్యాన్స్ మాస్టర్లలో ఒకడిగా వెలుగొందాడాయన. దర్శక ధీరుడు రాజమౌళి ‘మగధీర’లో ధీర ధీర పాటకు శివశంకర్ తోనే డ్యాన్స్ కంపోజింగ్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటకు అద్భుత రీతిలో నృత్య రీతులు సమకూర్చి జాతీయ అవార్డు సైతం అందుకున్నారు శివశంకర్. తాజాగా ఒ ఒక ఇంటర్వ్యూలో తెలుగు హీరోల డ్యాన్సింగ్ టాలెంట్ గురించి ఆయన మాట్లాడారు.

ఒకప్పుడు తాను పని చేసిన సీనియర్ హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు మంచి డ్యాన్సరని శివశంకర్ అభిప్రాయపడ్డారు. చంద్రమోహన్ కూడా బాగా డ్యాన్స్ చేసేవాడన్నారు. కృష్ణ దగ్గర మంచి డ్యాన్స్ టెక్నిక్ ఉందని.. హీరోయిన్ని కొంచెం ముందు పెట్టి ఆమె డ్యాన్స్ చేస్తుంటే అది చూసి ఆయన ఈజీగా చేసేసేవారని శివశంకర్ అన్నారు. శోభన్ బాబుకు డ్యాన్స్ కంపోజ్ చేయడం మాత్రం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవితో తాను చేసిన ‘రగులుతోంది మొగలి పొద’ పాట చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందని.. తన దగ్గర ప్రతి డ్యాన్స్ మూమెంట్ కూ పది రకాల స్టెప్పులు ఉంటాయని.. ఐతే చిరంజీవి మాత్రం ఇంకోటి ప్రయత్నిద్దామని అనేవాడని శివశంకర్ చెప్పారు. ఈ తరంలో అల్లు అర్జునే నంబర్ వన్ డ్యాన్సర్ అని శివశంకర్ కితాబివ్వడం విశేషం. బన్నీ బాగా డ్యాన్స్ నేర్చుకుని.. మన యువతరం దీన్ని ఈదాలి అని కృషి చేస్తున్నాడని.. అందుకు హ్యాట్సాఫ్ అని.. అతను బ్యూటిఫుల్ డ్యాన్సరని.. తెలుగులో టాప్ డ్యాన్సర్ బన్నీనే అని కాంప్లిమెంట్ ఇచ్చారు శివశంకర్.