Begin typing your search above and press return to search.

ఈసారి అలా సెట్ చేసిన శివ నిర్వాణ

By:  Tupaki Desk   |   8 March 2020 8:01 AM GMT
ఈసారి అలా సెట్ చేసిన శివ నిర్వాణ
X
న్యాచురల్ స్టార్ నాని 'V' తో పాటుగా 'టక్ జగదీష్' అనే చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వరస విజయాలతో దూసుకుపోతున్న శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకుడు. ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసే శివ నిర్వాణ ఈసారి 'టక్ జగదీష్' లో ఏం చేస్తాడో అనేది ఆసక్తికరం. 'టక్ జగదీష్' లో కూడా ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్ తోనే కథను నడపబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో నానికి ప్రియురాలిగా రీతు వర్మ నటిస్తోంది. మరదలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపిస్తుంది. ఇటు ప్రియురాలు అటు మరదలు మధ్య నాని సతమతమైపోతాడట. ఇలా ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోవడం మాత్రమే కాకుండా అన్నదమ్ముల అనుబంధం కూడా ఈ సినిమాలో కీలకంగా ఉంటుందట. నాని అన్నయ్య పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారని.. నాని- జేబీల మధ్య వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం. 'టక్ జగదీష్' షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో కొనాగుతోందని.. నాని-జగపతిబాబు మధ్య వచ్చే కీలక సన్నివేశాలను శివ నిర్వాణ టీమ్ చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాకు సూపర్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. 'మజిలీ' సినిమాను నిర్మించిన షైన్ స్క్రీన్స్ వారు ఈ సినిమాకు నిర్మాతలు. మే నెలాఖారుకల్లా షూటింగ్ పూర్తి చేసి జులైలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.