Begin typing your search above and press return to search.

శివ ఎఫెక్ట్ జగదీష్ పంట పండింది

By:  Tupaki Desk   |   27 March 2021 6:54 AM GMT
శివ ఎఫెక్ట్ జగదీష్ పంట పండింది
X
నిన్ను కోరి.. మజిలీ సినిమాలతో ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న శివ నిర్వాన అతి త్వరలో నానితో కలిసి టక్ జగదీష్ సినిమాతో రాబోతున్నాడు. వీరి కాంబోలో ఇప్పటికే నిన్ను కోరి సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హిట్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. శివ నిర్వాన పై నమ్మకం తో టక్ జగదీష్ పై బయ్యర్లు భారీ మొత్తాన్ని పెడుతున్నారు.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తంలో బిజినెస్ చేసే అవకాశం కనిపిస్తోంది. నానికి ఉన్న క్రేజ్ కు తోడు శివ నిర్వాన బ్రాండ్ కూడా తోడు అవ్వడంతో సినిమా నిర్మాతలకు విడుదలకు ముందు కాసుల వర్షం కురిపిస్తుంది అంటూ టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. సినిమాలో నానికి జోడిగా రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు థమన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.