Begin typing your search above and press return to search.
ఏఎన్నార్ సినిమాలు చూడటం కోసం తన్నులు తిన్నాను: శివనాగేశ్వరరావు
By: Tupaki Desk | 21 Sept 2021 8:00 AM ISTఅక్కినేని నాగేశ్వరరావును అభిమానించనివారు ఎవరు? ఆరాధించనివారు ఎవరు?. ఆయన నుంచి స్ఫూర్తిని పొందనివారు ఎవరు? ఆయనను ఆదర్శంగా తీసుకోనివారు ఎవరు? ఆయన నటన ఒక గ్రంథాలయం .. అలాంటి ఆయన జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనతో తమకి గల అనుబంధాన్ని చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. అలా దర్శకుడు శివ నాగేశ్వరరావు కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
"మొదటి నుంచి కూడా నేను అక్కినేని అభిమానిని .. ఆయన సినిమాలు వదలకుండా చూసేవాడిని. ఒక ఆటకి టికెట్లు దొరక్కపోతే మరో ఆటకి .. ఒక ఊళ్లో తికెట్లు దొరక్కపోతే మరో ఊరుకు .. అవసరమైతే బ్లాక్ లో టికెట్లు కొనుక్కుని మరీ ఆయన సినిమాలు చూసేవాడిని. వర్షం వచ్చినా లెక్క చేయకుండా ఆయన సినిమాలకు వెళ్లిన రోజులు ఉన్నాయి. సెకండ్ షో సినిమాలు చూసి ఇంటికి వచ్చిన తరువాత తన్నులు తిన్న సందర్భాలు ఉన్నాయి. ఆయన పట్ల గల అభిమానం ముందు ఇవన్నీ పెద్ద కష్టాలుగా అనిపించేవి కాదు.
ఇండస్ట్రీకి ఎన్టీఆర్ .. ఏఎన్నార్ రెండు కళ్లుగా ఉండేవారు. ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఇద్దరూ కలిసి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ ఉండేవారు. ఇక పారితోషికం కూడా ఇద్దరూ పోటీపడి పెంచకుండా, కలిసి మాట్లాడుకుని పెంచేవారు. రెండేళ్లకి ఒకసారి తమ పారితోషికాలను పెంచేవారు .. నిర్మాతలను పిలిచి ఒక సమావేశంలో ఆ విషయం చెప్పిన తరువాతనే ముందుకు వెళ్లేవారు.
తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడంలో ఇద్దరూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సొంత స్టూడియోల నిర్మాణం చేపట్టి సినిమాలను నిర్మించారు. ఎన్టీఆర్ తో పోలిస్తే అక్కినేని పర్సనాలిటీ .. వాయిస్ కాస్త వీక్ గా ఉండేవి. వాటిని అధిగమించడానికి ఆయన ఎంతో శ్రమించేవారు. నేను అఖిల్ తో 'సిసింద్రీ' చేయడం .. ప్రారంభోత్సవానికి అక్కినేని కుటుంబం అంతా రావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనను నేను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాను" అని చెప్పుకొచ్చాడు.