Begin typing your search above and press return to search.

లీక్ : బిగ్‌ బాస్‌ 3 చివరి ఎలిమినేషన్ ఎవరంటే!

By:  Tupaki Desk   |   26 Oct 2019 12:54 PM GMT
లీక్ : బిగ్‌ బాస్‌ 3 చివరి ఎలిమినేషన్ ఎవరంటే!
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 మరో వారం రోజుల్లో పూర్తి కాబోతుంది. రేపటి ఎపిసోడ్‌ లో చివరి ఎలిమినేషన్‌ ఉండబోతుంది. రేపటికి సంబంధించి నేడే షూటింగ్‌ పూర్తి చేశారు. ఈ వారం రాహుల్‌ మినహా ఇంటి సభ్యులు అంతా ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యారు. ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయిన వారిలో బాబా భాస్కర్‌.. శ్రీముఖి.. వరుణ్‌.. శివ జ్యోతి.. అలీ ఉన్నారు. ఈ అయిదుగురిలో నిన్నటి ఎపిసోడ్‌ లోనే అనూహ్యంగా బాబా భాస్కర్‌ ను బిగ్‌ బాస్‌ సేవ్‌ అయినట్లుగా ప్రకటించాడు.

మిగిలిన నలుగురిలో ఎవరు సేవ్‌ అయ్యేది వీకెండ్‌ ఎపిసోడ్స్‌ లో నాగార్జున వచ్చిన తర్వాత తెలుస్తుందని చెప్పాడు. నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ లో ఒక్కరు లేదా ఇద్దరు సేవ్‌ అయితే ఆదివారం అంటే రేపు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ లో ఎవరు ఎలిమినేట్‌ అయ్యేది చెప్పబోతున్నారు. రేపు ఎలిమినేట్‌ అయ్యేది శివ జ్యోతి అంటూ స్టార్‌ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సాయంత్రం వరకు షూటింగ్‌ జరుపుకున్న ఆదివారం ఎపిసోడ్‌ కు సంబంధించి లీక్‌ వచ్చింది. శివ జ్యోతి ఎలిమినేషన్‌ పక్కా అంటూ వారు చెబుతున్నారు.

శివ జ్యోతి ఎలిమినేట్‌ అవ్వడంతో అంతా అనుకున్నట్లుగానే రాహుల్‌.. శ్రీముఖి.. బాబా భాస్కర్‌.. వరుణ్‌ సందేశ్‌.. అలీలు ఫైనల్‌ కు వెళ్లారు. ఈ అయిదుగురిలో విన్నర్‌ ఎవరు అనే విషయంను ప్రేక్షకులు ఓట్ల ద్వారా తెలియజేస్తారు. శివ జ్యోతి ఫైనలిస్ట్‌ గా ఉంటుందని చాలా మంది భావించారు. కాని ఆమె ఎలిమినేట్‌ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. రేపటి ఎపిసోడ్‌ లో శివ జ్యోతి ఎలిమినేషన్‌ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.