Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ లో ఆ ఇద్ద‌రికి ఊహించ‌ని షాక్‌...

By:  Tupaki Desk   |   13 Aug 2019 4:52 AM GMT
బిగ్‌ బాస్‌ లో ఆ ఇద్ద‌రికి ఊహించ‌ని షాక్‌...
X
గత వారం బిగ్ బాస్ హౌస్ లో నానా రచ్చ చేసిన తమన్నా ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో హౌస్ లో 13 మంది సభ్యులు మిగిలారు. ఇక ఈ 13 మందికి సంబంధించి సోమవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో ఊహించని విధంగా నామినేషన్స్ జరిగాయి. గత వారం ఓ టాస్క్ లో భాగంగా నిధి ఉన్న బాక్స్ ని బద్దలుగొట్టినప్పుడు రవి చేతికి గాయమైన విషయం తెలిసిందే. ఈ గాయానికి పరోక్షంగా కారణమైన శ్రీముఖిని ఈ వారం డైరెక్ట్ గా నామినేట్ చేశారు.

అలాగే బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేసిన అలీ- పునర్నవి లని నామినేషన్ నుంచి తప్పించారు. దీంతో మిగిలిన 10మంది సభ్యులని జంటలుగా వచ్చి ఎవరు నామినేట్ అవుతారో చర్చించుకుని ఆ పేరుని బిగ్ బాస్ కి చెప్పాలని సూచించారు. నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టి.. ఇద్దరు సభ్యులను కన్ఫెషన్ రూమ్‌ లోకి ఆహ్వానించాడు. ముందుగా రవికృష్ణ- వితిక వెళ్లారు. గతంలో టాస్క్ సంబంధించి ఇంటి ప్రాపర్టీని డామేజ్ చేసినందుకు నేను నామినేట్ చేసుకొంటానని, వితికను సేఫ్ చేశాడు.

ఆ తర్వాత శివజ్యోతి-రోహిణి వెళ్లారు. వీరు బిగ్ బాస్‌ ని విసిగించారు. మొదట శివజ్యోతిని నామినేట్ చేసిన బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నియామాలను ఉల్లంఘించినందుకు రోహిణిని కూడా నామినేట్ చేశాడు. అంతేకాకుండా వచ్చే వారం కూడా శివజ్యొతి- రోహిణిని నామినేట్ చేస్తూ బిగ్‌ బాస్ షాకిచ్చాడు. దాంతో ఇద్దరూ కొంత నిరాశకు, అసంతృప్తికి లోనయ్యారు.

వీరి తర్వాత మహేష్ విట్ట -వరుణ్ సందేశ్- రాహుల్ -హిమజ- బాబా భాస్కర్ -ఆషూ వెళ్లి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. వీరిలో వరుణ్- రాహుల్- బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు. మొత్తం మీద ఈ వారం ఎలిమినేషన్ లో శ్రీముఖి- రవి- రోహిణి- శివజ్యోతి- వరుణ్- రాహుల్- బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు. ఇక అనవసరంగా వచ్చే వారానికి కూడా శివజ్యోతి- రోహిణిలు నామినేట్ అయ్యారు. మరి చూడాలి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో.