Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఇంట్లోకి శివబాలాజీ.?

By:  Tupaki Desk   |   28 July 2018 6:39 AM GMT
బిగ్ బాస్ ఇంట్లోకి శివబాలాజీ.?
X
గడిచిన కొన్ని వారాలుగా లో స్లో రేటింగ్ తో నడుస్తున్న బిగ్ బాస్ కు ఈ వారం బాగా కలిసి వచ్చింది. రేటింగ్ బాగా పెరిగింది. పోయిన రెండు వారాల్లో చోటు చేసుకున్న సంఘటనలు - అతిథుల రాకతో షోపై జనాలకు ఆసక్తి కలిగింది. యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ ఇవ్వడంతో పాటు అందరినీ ఎమోషన్ కు గురిచేశాడు. ప్రదీప్ వచ్చాకే కొంచెం రేటింగ్ పెరిగిందని బిగ్ బాస్ టీం భావిస్తోంది. దాన్ని అలాగే కంటిన్యూ చేసేందుకు తాజాగా బిగ్ బాస్1 విజేత శివబాలాజీని బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

తాజాగా శివబాలాజీ బిగ్ బాస్ లోకి అతిథిగా వెళ్తున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎవ్వరూ నీట్ గా ఆడడం లేదు. బిగ్ బాస్ విజేతగా నిలవడానికి కాకుండా తమ వ్యక్తిగత విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రేమలో పడుతున్నారు.. కోపాలు పెంచుకుంటున్నారు.. స్వార్థంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఆడడం వల్ల అసలు విజేతలు కారని.. మొదటి సీజన్ లో శివబాలాజీలా నీట్ గా ఆడాలనే ఉద్దేశంతో అతడిని బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ గా పంపబోతున్నారని వార్తలు లీక్ అయ్యాయి.

శివబాలాజీ హౌస్ లోకి వెళితే .. ఇంటిసభ్యులందరికీ ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు.. ఎలా మెలగాలో చెబుతాడని.. దానివల్ల బిగ్ బాస్ లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడి పోటీ పెరుగుతుందని టీం యోచిస్తోంది. అందుకే ఈ వారంలో శివబాలాజీని ఎంట్రీ చేయాలని చూస్తున్నారు. మరి ఈ వార్త నిజమైతే మాత్రం బిగ్ బాస్ ఇంటిసభ్యులకు మరో సర్ ప్రైజ్ రెడీగా ఉన్నట్టే..