Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బాహువులు పొంగించిన రాపో!

By:  Tupaki Desk   |   20 April 2020 9:15 AM IST
ఫోటో స్టోరి: బాహువులు పొంగించిన రాపో!
X
బాహువులు పొంగించి రామ్ పోతినేని ఇచ్చిన ఈ ఫోజును చూశారా? తాజాగా సోష‌ల్ మీడియాలో అత‌డు షేర్ చేసిన ష‌ర్ట్ లెస్ ఫోటో చూడ‌గానే.. ఫ్యాన్స్ ఒక‌టే ఫిదా అయిపోతున్నారు. ఇది ఎవ‌రై ఉంటారు..మ‌న‌ రాపో యేనా? మునుప‌టితో పోలిస్తే చాలా బెట‌ర్ అయ్యాడు. బాడీని బాగానే బిల్డ్ చేస్తున్నాడు! అంటూ ఒక‌టే పొగిడేస్తున్నారు.

ఇంత‌కుముందు `రెడ్` ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ లో ష‌ర్ట్ లెస్ ఫోజుతో ఆక‌ట్టుకున్న‌ రామ్ తాజాగా త్రోబ్యాక్ ఫోటోల‌తో వేడెక్కించేస్తున్నాడు. ఇదంతా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ రెడ్ కోసం అత‌డు జిమ్ముల్లో ప‌డిన శ్ర‌మ క‌నిపిస్తోంది. షర్ట్ లెస్ లుక్ చూసి నాటీ లేడీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ లుక్ లో రామ్ హాట్ అప్పీల్ తో కనిపిస్తున్నాడు. స‌ముద్ర తీరంలో ఆహ్లాద‌క‌ర‌మైన స్విమ్మింగ్ పూల్ వ‌ద్ద ఇలా ప‌రిస‌రాల్ని ఆస్వాధిస్తూ చిద్విలాసంగా క‌నిపిస్తున్నాడు. సూర్యాస్తమయం బంగారు వ‌ర్ణం అతని బేర్ ఛాతీ పై ప్రతిబింబిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో రామ్ డైహార్డ్ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది.

రామ్ ఏం చేసినా సినిమా కోస‌మే. ఇటీవ‌ల కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ఫామ్ లోకి వ‌చ్చాడు. అటుపై హార్డ్ వ‌ర్క్ ని మ‌రింత పెంచాడు. అత‌డు న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ రెడ్ ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్ లో రిలీజ్ కావాల్సింది. క‌రోనా లాక్ డౌన్ పెద్ద అడ్డంకిగా మారింది. ఈ ఏడాది సినిమా రిలీజ్ వ్య‌వ‌హారం ఆల్మోస్ట్ క్రైసిస్ లో ప‌డింది. రెడ్ రిలీజ్ విష‌యంలో ఏం ఆలోచిస్తున్నార‌న్న‌ది చూడాలి.