Begin typing your search above and press return to search.

శిరీష్‌- అనూ `ప్రేమ కాదంట‌`.. మ‌రి ఇదేంటంట‌?

By:  Tupaki Desk   |   30 May 2021 6:37 AM GMT
శిరీష్‌- అనూ `ప్రేమ కాదంట‌`.. మ‌రి ఇదేంటంట‌?
X
గ‌త కొన్ని రోజులుగా యువ‌హీరో అల్లు శిరీష్ వ్య‌వ‌హారం చూస్తున్న‌దే. యంగ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ తో అత‌డి రొమాన్స్ పీక్స్ లో క‌నిపిస్తోంది. యువ‌నాయిక‌తో లివిన్ రిలేష‌న్ షిప్ లో ఉన్నాడా? అంటూ ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇటీవ‌ల అత‌డు న‌టిస్తున్న రొమాంటిక్ మూవీ ప్రీలుక్ పోస్ట‌ర్ల‌తో పుట్టుకొచ్చిన డౌట్లు ఇవి. వ‌రుస‌గా రిలీజ్ చేసిన రెండు ప్రీలుక్ పోస్ట‌ర్లు రొమాంటిక్ మూడ్ ఎలివేష‌న్ తో ఆక‌ట్టుకున్నాయి. `లివిన్ రిలేష‌న్ షిప్` (స‌హ‌జీవ‌నం)పై నేటిత‌రం సినిమా ఇద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

తాజాగా ఫ‌స్ట్ లుక్ కి సంబంధించిన రెండు పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేస్తూ `ప్రేమ కాదంట` అనే టైటిల్ ని చిత్ర‌బృందం ఆవిష్క‌రించింది. ఈ పోస్ట‌ర్ల‌లో అల్లు శిరీష్ -అనూ రొమాన్స్ పీక్స్ లో క‌నిపిస్తోంది. అలా అద్దం ముందు శిరీష్‌ కౌగిలింత‌లో ఒదిగిపోయిన అనూ సెల్ఫీ తీస్కుంటూ చిలౌట్ గా ఒక పోస్టర్‌ లో క‌నిపించింది. అలాగే చిట‌ప‌ట చినుకుల వేళ అలా అనూని ప్రేమ‌గా గోముగా ద‌గ్గ‌ర‌కు తీసుకుంటున్న శిరీష్ రొమాంటిక్ మూడ్ వేరొక పోస్ట‌ర్ లో పీక్స్ అనే చెప్పాలి. పోస్ట‌ర్ల‌తోనే యూత్ కి టీనేజ‌ర్ల‌కు కిక్కిస్తోంది.

శిరీష్ - అనూ మ‌ధ్య రొమాన్స్ ఓ రేంజులోనే పండింద‌ని ఈ పోస్ట‌ర్లు చెబుతున్నాయి. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. నేడు (మే 30) శిరీష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అల్లు అర్జున్ త‌న సోద‌రుడికి శుభాకాంక్ష‌లు తెలిపారు. `బిగ్గెస్ట్ మోర‌ల్ సపోర్ట్ శిరీష్` అంటూ వ్యాఖ్యను జోడించారు. తుపాకి త‌ర‌పున శిరీష్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.