Begin typing your search above and press return to search.

గ్రేట్ గ్రాండ్ మస్తీ ఆపేయమంటున్న హీరో

By:  Tupaki Desk   |   15 July 2016 9:30 AM GMT
గ్రేట్ గ్రాండ్ మస్తీ ఆపేయమంటున్న హీరో
X
షైనీ అహూజా అని ఓ బాలీవుడ్ హీరో ఉన్నాడు గుర్తుందా.. మాంచి రొమాంటిక్ సినిమాల్లోనే కనిపించి ఇతగాడికి ఈ మధ్య సినిమా ఛాన్సులు రావట్లేదు. ఇందుకు కారణం.. అప్పట్లో షైనీపై వచ్చిన వరుస ఆరోపణలే. లైంగికంగా వేధించాడంటూ సయాలీ భగత్.. ఆ తర్వాత పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణల కారణంగా కేసులో ఇరుక్కున్నాడు.

మొదట్లో ఈ కేసు తేలిపోతుందని అనుకున్నారు కానీ.. ఇప్పుడు పరిస్థితి చూస్తే కనీసం ఏడేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందనే అంచనాలున్నాయి. ఇప్పుడీ షైనీ అహూజా హఠాత్తుగా వార్తల్లోకి వచ్చాడు. ఇందుకు కారణం గ్రేట్ గ్రాండ్ మస్తీ అంటూ వచ్చిన అడల్ట్ కామెడీ మూవీ. ఆ సినిమాలో షైనీ నటించలేదు కానీ.. ఓ పని మనిషి పాత్రకు షైనీ అనే పేరు పెట్టారు. ఇది తనను ఉద్దేశించే పెట్టారన్నది ఇతగాడి ఆరోపణ. నా పేరు ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదంటూ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశాడు.

'సినిమాలో నా పేరు ఉపయోగించకుండా చూడాలి.. లేదా సినిమా రిలీజ్ అపేయాలి' అన్నది షైనీ అహూజా డిమాండ్. ఈ కేసు ఎటు తేలుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం కానీ.. ఇతగాడు పెట్టిన కేసు కారణంగా.. గ్రేట్ గ్రాండ్ మస్తీలో పని మనిషి పాత్ర.. షైనీ అహూజా దే అనే ప్రచారం మొదలైపోయింది.