Begin typing your search above and press return to search.

చెప్ప‌కుండా OTT లో రిలీజ్ చేస్తారా? ద‌ర్శ‌కుడు పిటిష‌న్!

By:  Tupaki Desk   |   15 May 2021 10:00 AM IST
చెప్ప‌కుండా OTT లో రిలీజ్ చేస్తారా? ద‌ర్శ‌కుడు పిటిష‌న్!
X
క‌రోనా మ‌హ‌మ్మారీ విచిత్ర‌మైన స‌మ‌స్య‌లు సృష్టిస్తోంది. ఓవైపు సెట్స్ పై ఉన్న సినిమాల చిత్రీక‌ర‌ణ‌లు పూర్త‌వ్వ‌క‌పోవ‌డం అలాగే రిలీజ్ తేదీల డైల‌మా వెర‌సి నిర్మాత‌లు తీవ్ర న‌ష్టంలో కూరుకుపోయే స‌న్నివేశం ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కోలీవుడ్ లో ఇది అలాంటి గొడ‌వే.

త‌న‌కు చెప్పుకుండానే తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాని ఓటీటీలో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నార‌ని ఆరోపిస్తూ శింబు ద‌ర్శ‌కుడు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దర్శకుడు యు.ఆర్. జమీల్ త‌న సినిమా `మ‌హా `ఓటీటీ విడుదల నుండి నిషేధాన్ని కోరుతున్నారు. శింబు-హన్సిక జంట‌గా నటించిన `మహా` దాదాపు రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నందున దర్శకుడు తనకు తెలియకుండానే ఈ చిత్రం పెండింగ్ ప‌నులు పూర్తి చేశార‌ని నిర్మాతపై కేసు పెట్టారు. అలా రిలీజ్ కానివ్వ‌కుండా నిర్మాణ సంస్థపై నిషేధాన్ని దాఖలు చేశాడు.

అంతేకాదు ఈ సినిమా పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించి ఏదీ త‌న అనుమ‌తి తీసుకోలేద‌ని స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఆరోపించారు. కథకు అవసరమైన సన్నివేశాలను పరిగణనలోకి తీసుకోకుండా సినిమాలోని కొన్ని భాగాలను తన అసిస్టెంట్ డైరెక్టర్ చిత్రీకరించారని దర్శకుడు ఆరోపించారు. ఎడిటింగ్.. నేప‌థ్య సంగీతం స‌హా ఏదీ త‌న‌కు తెలియ‌కుండా పూర్తి చేశార‌ని కూడా జ‌మీలా ఆరోపించారు. ఒక పైలెట్ (శింబు) తో ప్రేమ‌లో ప‌డే పైలెట్ అటెండెంట్ (హ‌న్సిక‌) స్టోరి ఇది. ఈ జంట‌కు పుట్టిన ఆడ‌బిడ్డ మ‌ర‌ణం వెన‌క దుర్మార్గుల్ని హీరో ఎలా ప‌ట్టుకుని చంపాడు? అన్న‌దే మిగిలిన క‌థాంశం.

కానీ క‌థ‌ను మార్చార‌న్న‌ది ద‌ర్శ‌కుడు జ‌మీలా ఆరోప‌ణ‌. ఇక ద‌ర్శ‌కుని పారితోషికం విష‌యంలోనూ రుబాబ్ బ‌య‌ట‌ప‌డింది. చిత్ర నిర్మాతలు త‌న‌కు 24 లక్షలు చెల్లించాల్సి ఉండ‌గా కేవలం 8.15 లక్షలు మాత్రమే చెల్లించారని .. తనకు తెలియకుండానే పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేసినందునన‌ రూ .10 లక్షల పరిహారంతో త‌నకు రావాల్సిన‌ది చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పిటిషన్‌పై మే 19 లోగా స్పందించాలని జడ్జి కృష్ణన్ రామసామి నిర్మాత‌ల‌కు ఆర్డ‌ర్ జారీ చేశారు.