Begin typing your search above and press return to search.

నిత్య‌య‌వ్వ‌నురాలిగా షేక్ చేస్తున్న సాగ‌ర‌కన్య‌

By:  Tupaki Desk   |   15 July 2021 7:52 AM GMT
నిత్య‌య‌వ్వ‌నురాలిగా షేక్ చేస్తున్న సాగ‌ర‌కన్య‌
X
`సాహ‌స‌వీరుడు సాగ‌ర‌క‌న్య` చిత్రంతో తెలుగు ఆడియెన్ ని స్పెల్ బౌండ్ చేసిన మేటి క‌థానాయిక శిల్పాశెట్టి ఆ త‌ర్వాత టాలీవుడ్ లో సుదీర్ఘ ఇన్నింగ్స్ ని కొన‌సాగించింది. సౌత్ లో విక్ట‌రీ వెంక‌టేష్ తో తొలి అవ‌కాశం. ఆ త‌ర్వాత క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబు.. ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా లాంటి స్టార్ల స‌ర‌స‌న ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టించింది. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే త‌న సోద‌రి ష‌మితా శెట్టిని ఇటు సౌత్ కి ప‌రిచ‌యం చేసింది. కానీ కాల‌క్ర‌మంలో శిల్పాజీ అటు హిందీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లిపోయి అక్క‌డే బాంబే డైయింగ్ రాజ్ కుంద్రాని పెళ్లాడి లైఫ్ లో సెటిలైన సంగ‌తి తెలిసిందే. శిల్పాశెట్టి ప్ర‌స్తుతం ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మ‌మ్మీ.

వ‌య‌సు 47 .. అయ‌నా ఇంకా ఇప్ప‌టికీ సాగ‌ర‌క‌న్య‌నే త‌ల‌పిస్తూ నాటి రూపాన్ని రిపీట్ చేస్తూ షాక్ కి గురి చేస్తోంది. ఇక స‌మ‌కాలీన నాయిక‌ల్లో మెరుపుతీగ‌లా మెరిసిపోయే ఈ బ్యూటీ అప్ప‌ట్లో `యోగా క్యాసెట్ల`ను రిలీజ్ చేసి సంచ‌ల‌నాలు సృష్టించింది.

ఇప్ప‌టికీ అదే టింజ్ త‌న బాడీలో క‌నిపిస్తోందంటే దానికి త‌న ప‌ర్ఫెక్ట్ కమిట్ మెంట్ ఓ కార‌ణం. యోగా జిమ్ సెష‌న్స్ తో నిత్య‌య‌వ్వ‌నురాలిగా త‌న‌ని తాను మ‌లుచుకోవ‌డ‌మే గాక యువ‌త‌రంలో శిల్పాజీ స్ఫూర్తిని నింపుతున్నారు. ఇప్ప‌టికీ ప‌లు రియాలిటీ డ్యాన్సింగ్ షోస్ లో జ‌డ్జిగా అల‌రిస్తున్నారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో భారీ పెట్టుబ‌డులు పెట్టి ఆర్జ‌కురాలిగా శిల్పాశెట్టి ఎంట‌ర్ ప్రెన్యూర్ షిప్ కొన‌సాగుతోంది. శిల్పాజీ తిరిగి న‌ట‌న‌లోకి వ‌స్తున్నార‌ని.. స‌హాయ‌క పాత్ర‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.