Begin typing your search above and press return to search.

లేటు వయస్సులో ఈ ఘాటు రచ్చ ఏల

By:  Tupaki Desk   |   12 Aug 2016 12:31 PM IST
లేటు వయస్సులో ఈ ఘాటు రచ్చ ఏల
X
ఎంతైనా శిల్పాశెట్టి అంటే శిల్పాశెట్టే. ఓ వైపు వయసు మీద పడిపోతున్నా.. చూపించి చూపించకుండా.. ఘాటు ఫోజుల్లో అందాలతో ఎలా రచ్చ చేయాలో ఈ పొడుగు కాళ్ల సుందరికి బాగా తెలుసు.

ఓ వైపు తన ఏజ్ వాళ్లంతా హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతుంటే.. శిల్పా మాత్రం సంప్రదాయ చీర కట్టులోనే మ్యాజిక్ చేసింది. అద్దాలతో ధగధగలాడిపోతున్న బ్లాక్ కాక్ టైల్ శారీ కట్టుకోని.. వాలు కళ్లేసుకోని శిల్పా విసిరిన లుక్.. చూసే వాళ్ల గుండెలకి కొంచెం గట్టిగానే తాకేలా ఉంది. పేరుకు తగ్గట్టే నిజంగా శిల్పంలా ఉన్న ఈ భామ హాయ్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. శారీలోనూ అందాలు ఎలా ఆరబోయాలో శిల్పాని చూసే నేర్చుకోవాలి. స్లీవ్ లెస్ జాకెట్ లో కనిపించి కనిపించని సోయగాలు.. సగం నడుము చూపిస్తూ బొడ్డు కిందకు కట్టిన చీర.. ఆ బారు నడుంకి ఓ వడ్డాణం పెట్టుకోని స్టైల్ కే కేరాఫ్ లా ఉన్న శిల్పాశెట్టి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.

తెలుగులో గతంలో సాహసవీరుడు సాగరకన్య - ఆజాద్ వంటి సినిమాల్లో మెరిసిన ఈ భామ.. ఇప్పుడు నదియా తరహాలో ఏమన్నా రోల్స్ కోసం ట్రై చేయొచ్చేమో. ఏమంటారు గయ్స్?