Begin typing your search above and press return to search.

శిల్పా శెట్టి బంగ్లా చూస్తే దిమ్మదిరుగుతుంది

By:  Tupaki Desk   |   6 July 2016 11:13 AM GMT
శిల్పా శెట్టి బంగ్లా చూస్తే దిమ్మదిరుగుతుంది
X
అంతంత డబ్బులున్నాయి.. ఏం చేసుకుంటారు.. ఇంకా ఇంకా సంపాదించాలని ఎందుకంత తాపత్రయ పడుతుంటారు అని కోటీశ్వరుల్ని చూసి మామూలు జనాలు ఆశ్చర్యపోతుంటారు. కానీ లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టే ముకేష్ అంబాని అన్ని వేల కోట్లు పెట్టి ముంబయిలో ‘అంటిలా’ భవనం కట్టగలిగాడు. షారుఖ్ వందల కోట్లు పోసి ‘మన్నత్’ నిర్మించుకోగలిగాడు. ఇదే తరహాలో శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా జంట సైతం ముంబయి శివార్లలో ఓ కళ్లు చెదిరే భవనాన్ని నిర్మించుకుంది. దాని విశేషాల్ని ఓ మీడియా సంస్థతో పంచుకుంది శిల్పా. ఆ భవనం తాలూకు ఫొటోలు చూస్తే వావ్ అనిపించడం ఖాయం.

సముద్ర తీరానికి దగ్గర్లో.. సినిమా సెట్టింగులు కూడా చిన్నబోయేలా అద్భుతంగా ఈ ఇంటిని తీర్చిదిద్దుకున్నారు శిల్పా-కుంద్రా. విదేశాల నుంచి డిజైనర్లు వచ్చి కొన్ని నెలల పాటు శ్రమించి ఈ ఇంటిని తీర్చిదిద్దారు. స్వతహాగా డిజైనర్ అయిన శిల్పా తన టేస్టుకు తగ్గ్గట్లుగా ఈ ఇంటిని అద్భుతంగా మలుచుకుంది. ఈ లగ్జరియస్ బంగ్లాకు ‘కిన్నెర’ అని పేరు పెట్టుకుంది శిల్పా జంట. ఈ బంగ్లాలో అన్ని వస్తువులూ.. నిర్మాణానికి వాడిన సామగ్రి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవే. చాలా అన్నిటికీ భారీగా ఖర్చు చేశారు. సౌకర్యాలు ఫైవ్ స్టార్ హోటల్ ను మించిపోయేలా ఉంటాయి. భారీ డైనింగ్ హాళ్లు.. డైనింగ్ రూంలు.. హాల్స్.. అబ్బో వ్యవహారమైతే మామూలుగా లేదు. పడక మీది నుంచి సముద్ర అలలు చూస్తూ.. వాటినుంచి వచ్చే శబ్దాలు వింటూ నిద్రలోకి జారుకోవడం ప్రత్యేకమైన అనుభూతి అంటూ తన కలల బంగ్లా గురించి చెబుతోంది శిల్పా. అయినా డబ్బుంటే ఇలాంటి విలాసాలకు కొదవేముంది చెప్పండి.