Begin typing your search above and press return to search.

పోర్న్ చిత్రాల రాకెట్: శిల్పాశెట్టి భర్త అరెస్ట్

By:  Tupaki Desk   |   20 July 2021 4:01 AM GMT
పోర్న్ చిత్రాల రాకెట్: శిల్పాశెట్టి భర్త అరెస్ట్
X
పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నారన్న ఆరోపణలతో ప్రముఖ సినీ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నారనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయనపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయమై రాజ్ కుంద్రా పాత్ర కీలకంగా ఉందని.. అన్ని విచారణ జరిపాకే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై క్రైం బ్రాంచ్ లో ఫిబ్రవరి 2021లో పోర్న్ చిత్రాలకు సంబంధించి కేసు నమోదైందని తెలిపారు.

పోర్న్ చిత్రాల నిర్మాణం, పలు యాప్స్ లో వాటిని అప్ లోడ్ చేసిన కారణంగా ఈ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో రాజ్ కుంద్రా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.ప్రస్తుతం దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది’ అని ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు.

పోర్న్ చిత్రాల నిర్మాణం కేసులో ఫిబ్రవరి 7న బాలీవుడ్ నటి గెహానా వశిష్టను పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్న్ వీడియోలు చిత్రీకరిస్తూ.. వాటిని వెబ్ ఫ్లాట్ ఫామ్స్ లో అప్ లోడ్ చేస్తోందన్న ఆరోపణలతో అరెస్ట్ చేశారు. గెహానాతోపాటు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా రోయా ఖాన్ ను గుర్తించారు. ముంబై కేంద్రంగా ఓ గ్యాంగ్ పోర్న్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు ఈ కేసును ఛేధించే పనిలో పడ్డారు.

-ఖండించిన రాజ్ కుంద్రా

తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు రాజ్ కుంద్రా తెలిపారు. పోర్న్ చిత్రాలు నిర్మించినట్లుగా చెబుతున్న సంస్థతో తాను గతంలోనే తెగదెంపులు చేసుకున్నానని రాజ్ కుంద్రా తెలిపారు.

-గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు

గతంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాజ్ కుంద్రా సహ యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2013 సీజన్ లో బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ లో రాజ్ కుంద్రాపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐపీఎల్ లో పాల్గొనకుండా ఆయనపై నిషేధం కూడా పడింది. 2018లో బిట్ కాయిన్ కుంభకోణంలోనూ రాజ్ కుంద్రాపై ఆరోపణలు వచ్చాయి.  అప్పట్లో ఈడీ ఆయనను విచారించింది. తాజాగా పోర్న్ చిత్రాల కేసులో ఇరుక్కోవడంతో రాజ్ కుంద్రా పరువు ముంబైలో పోయినట్టైంది.