Begin typing your search above and press return to search.

మళ్లీ తల్లి అయిన బాలీవుడ్‌ బుట్టబొమ్మ

By:  Tupaki Desk   |   21 Feb 2020 8:45 AM GMT
మళ్లీ తల్లి అయిన బాలీవుడ్‌ బుట్టబొమ్మ
X
ఇటీవలే మన అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ పాటకు టిక్‌ టాక్‌ వీడియో చేసిన శిల్ప శెట్టి ఏ స్థాయిలో వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు కనీసం ప్రెగ్నెంట్‌ కూడా కాని శిల్ప శెట్టి మళ్లీ తల్లి ఎలా అయ్యిందని అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటీ అంటే శిల్ప శెట్టి రాజ్‌ కుంద్రా దంపతులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయ్యారు.

శివరాత్రి రోజున తమ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందంటూ ఈ దంపతులు సంతోషంగా ప్రకటించారు. పాప పేరు సమీషా అని ఖరారు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. సమీషా అంటే దేవుడి ఆశీర్వాదం పొందినది అని అర్థం. ఈపాప ఈనెల 15వ తారీకున జన్మించగా హాస్పిటల్‌ నుండి నేడు డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వచ్చినట్లుగా వారు ప్రకటించారు.

మా ప్రార్థనలు విన్న దేవుడు మాకు ఆడపిల్లను ప్రసాదించాడు. మా చిట్టి తల్లికి మీ ఆశీర్వాదాలు కావాలంటూ సోషల్‌ మీడియా ద్వారా ఈ తల్లిదండ్రులు కోరారు. 2009వ సంవత్సరంలో శిల్ప రాజ్‌ కుంద్రాలు వివాహం చేసుకున్నారు. రాజ్‌ కుంద్రాకు అంతకు ముందే పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న రాజ్‌ కుంద్రా ఆ తర్వాత శిల్పను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇప్పటికే ఒక బాబు ఉండగా ఇప్పుడు వీరికి పాప పుట్టడం తో వీరి ఆనందానికి అవదులు లేకుండా ఉంది.