Begin typing your search above and press return to search.

వీడియో : లైలా వెంటపడి టీజ్‌ చేసిన శిఖర్‌ ధావన్‌

By:  Tupaki Desk   |   19 Nov 2020 11:30 AM IST
వీడియో : లైలా వెంటపడి టీజ్‌ చేసిన శిఖర్‌ ధావన్‌
X
ఇటీవలే ఐపీఎల్‌ను ముగించుకుని ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీం ఇండియా క్వారంటైన్‌ను పూర్తి చేసుకుని ప్రాక్టీస్‌ కు సిద్దం అయ్యింది. ఈనెల 27న మొదటి మ్యాచ్‌ జరుగనుంది. ప్రాక్టీస్‌ సందర్బంగా ఆటగాళ్లు సరదాగా ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. తాజాగా నెట్‌ ప్రాక్టీస్ గ్యాప్‌ లో శిఖర్‌ ధావన్‌ మరియు పృథ్వీషాలు సరదాగా ఒక హిందీ పాటకు డాన్స్‌ చేశారు. ఆ పాటలో లేడీగా హొయలు ఒలికిస్తూ పృథ్వీషా నడుస్తూ వెళ్తూ ఉండగా వెనుకనుండి టీజ్‌ చేస్తున్నట్లుగా శివఖర్‌ ధావన్‌ అనుసరించాడు. ఆ సమయంలో తన షర్ట్‌ తీసేసి పృథ్వీ షా చేయి పట్టుకుని రొమాంటిక్‌ గా వ్యవహరించాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ లైలా నన్ను పిచ్చెక్కిస్తోంది అంటూ శిఖర్‌ దావన్‌ వీడియోను షేర్‌ చేయగా పృథ్వీ షా కూడా సరదాగా కామెంట్‌ పెట్టాడు. నవ్వులు పూయించిన వీరిద్దరు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం సందడి చేస్తున్నారు. మొదటి మ్యాచ్‌ కు ఇంకా వారం రోజులకు పైగానే ఉన్న కారణంగా ఆడుతూ పాడుతూ ప్రాక్టీస్‌ లో ఆటగాళ్లు సందడి చేస్తున్నారు. ఐపీఎల్‌ లో రాణించిన శిఖర్‌ ధావన్‌ ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా రాణిస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ఢిల్లీని ఫైనల్‌ వరకు తీసుకు పోయిన వ్యక్తి శిఖర్‌ అటువంటి శిఖర్‌ ఆసీస్‌ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాడో చూడాలి.