Begin typing your search above and press return to search.

ప్యానిక్ నుంచి బ‌య‌ట‌ప‌డి బాంద్రాలో షికార్లు

By:  Tupaki Desk   |   26 May 2021 10:30 AM GMT
ప్యానిక్ నుంచి బ‌య‌ట‌ప‌డి బాంద్రాలో షికార్లు
X
కోవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావం నెమ్మ‌దిగా త‌గ్గుతుంటే సెల‌బ్రిటీల్లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. ఈ వ‌ర్షాల సీజ‌న్ లో కోవిడ్ తీవ్ర‌త కాస్త త‌గ్గింది. జూన్ చివ‌రి నాటికి పూర్తిగా త‌గ్గిపోతుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. మ‌రోవైపు కోవిడ్ వ్యాక్సినేష‌న్ చేయించుకుని చాలామంది సెల‌బ్రిటీలు సేఫ్ జోన్ లోకి వ‌స్తున్నారు.

ఇదే నేప‌థ్యంలో ఆరుబ‌య‌ట షికార్లు చేసే సెల‌బ్రిటీల సంఖ్యా పెరిగింది. ఇంత‌కుముందు త‌న ప‌ప్పీ ని ఆరుబ‌య‌ట తిప్పేందుకు బాలీవుడ్ హాట్ గాళ్ మ‌లైకా అరోరా త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు విచ్చేసింది. బాంద్రా వీధిలో షికార్లు చేయ‌డం క‌నిపించింది.

ఇప్పుడు నేహాశ‌ర్మ సోద‌రి ఐషా శ‌ర్మ‌. . అలాగే సోఫీ చౌద‌రి లాంటి భామ‌లు ముంబై బాంద్రాలో జాగింగ్ కి వెళుతూ క‌నిపించారు. త‌మ వెంటే పెంపుడు కుక్క‌ల్ని ఆరుబ‌య‌ట షికార్ తిప్పారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు అంతర్జాలంలో వైర‌ల్ గా మారాయి. నెమ్మ‌దిగా ప్యానిక్ స‌న్నివేశం నుంచి ముంబై తేరుకుంటుంద‌నే దీన‌ర్థం. ఇక నేహాశ‌ర్మ‌-ఐషా శ‌ర్మ సిస్టర్స్ ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌రుస ఫోటోషూట్ల‌తో జిమ్ యోగా సెష‌న్స్ తో హీటెక్కించిన సంగ‌తి తెలిసిందే.