Begin typing your search above and press return to search.

పెద్దాయన పోతూ.. ఆవిరి చేసేశాడా

By:  Tupaki Desk   |   29 Sept 2017 11:00 AM IST
పెద్దాయన పోతూ.. ఆవిరి చేసేశాడా
X
షెర్లిన్ చోప్రా ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ లో పేరు సంపాదించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ బ్యూటీకి టాలీవుడ్ ఆడియన్స్ తో ముందునుంచే రిలేషన్ ఉంది. ఏ ఫిలిం బై అరవింద్ లో అందాలు ఆరబోసిన అందగత్తె ఈ సుందరాంగే. ఆ తర్వాత హిందీ సినిమాలతో బాగా బిజీ అయిపోయిన ఈమె.. కంటెంట్ ఉన్న అడల్ట్ మూవీస్ లో కూడా నటించి మెప్పిస్తోంది.

ప్రస్తుతం ఈమె ప్లేబోయ్ మేగజైన్ ఫౌండర్ హూగ్ హెఫ్నర్ మృతి పట్ల తెగ బాధపడిపోతోంది. ఎంతో మంది గ్లామర్ డాల్స్ కు అద్భుతమైన కెరీర్ ఇచ్చిన ప్లేబోయ్.. రీసెంట్ గా మరణించిన సంగతి తెలిసిందే. 91 ఏళ్ల పెద్దాయన.. వయసురీత్యా అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. అయితే.. షెర్లిన్ చోప్రా మాత్రం ఈయన మరణంపై తెగ ట్వీట్స్ చేసేస్తూ.. బాధపడుతూనే ఉంది. ఇందులో పెద్దాయన పోయాడనే సంతాపం కంటే.. స్వలాభం ఒకటి మిస్ అయిందనే ఫీలింగ్ కూడా ఉందని అంటున్నారు జనాలు. రీసెంట్ గా ప్లేబోయ్ కోసం ఓ న్యూడ్ ఫోటో షూట్ కూడా చేసింది షెర్లిన్. ఆ మేగజైన్ కవర్ పేజ్ ఎక్కాలనే కోరికను.. తనే వెల్లడించి మరీ ఆఫర్ అందుకున్న ఈమె.. ఆ ఫోటోషూట్ తంతు పూర్తి చేసింది.

ఇంకా ఆ ఫోటోషూట్ కి సంబంధించిన డీటైల్స్.. పిక్స్ బయటకు రాకముందే పెద్దాయన కాలధర్మం చేసేశాడు. ఈ ఫోటో షూట్ కనుక ఆయన చేతుల మీదుగా లాంఛ్ అయి ఉంటే.. షెర్లిన్ చోప్రా క్రేజ్ హాలీవుడ్ లో మార్మోగిపోయేది. ఇప్పుడు హూగ్ హెఫ్నర్ మృతితో అద్భుతమైన అవకాశం షెర్లిన్ కు చేజారిపోయింది. అమ్మడి బాధలో ఈ యాంగిల్ కూడా ఉండొచ్చని టాక్.