Begin typing your search above and press return to search.

హాంకాంగ్ లో రిలీఫ్ పొందిన నాగ్ హీరోయిన్

By:  Tupaki Desk   |   26 April 2017 4:56 AM GMT
హాంకాంగ్ లో రిలీఫ్ పొందిన నాగ్ హీరోయిన్
X
టీవీ కం మూవీ యాక్టర్ షెహనాజ్ ట్రెజరీవాలా పిక్చర్.. టాలీవుడ్ జనాలకు అంత తేలిగ్గా మైండ్ లోకి రాదు. 16 ఏళ్ల క్రితం నాగార్జున మూవీ ఎదురులేని మనిషిలో.. కంప్లీట్ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ.. యంగ్ నాగ్ కి జోడీగా నటించిన అమ్మాయి అంటే మాత్రం.. అక్కినేని అభిమానులకు బాగానే గుర్తొస్తుంది.

కొన్నేళ్లపాటు సినిమాలను సీరియస్ గానే తీసుకున్న షెహనాజ్ కు.. ప్రయాణాలంటే ప్రాణం. కొన్నేళ్లుగా అయితే కంప్లీట్ గా ఇదే పనిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు చుట్టేస్తూ.. కొత్త కొత్త అందాలను చూపించే పనిలో పడింది. పనిలోపనిగా తన అందాలను కూడా మిక్స్ చేసి చూపిస్తుంటుంది కాబట్టి.. ఈమెకు ఫాలోయింగ్ బాగా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడీ భామ హాంకాంగ్ లో సేద తీరుతోంది. తిరిగీతిరిగీ బాగా అలసిపోయింది కదా.. జెట్ లాగ్ నుంచి రిలీఫ్ పొందడానికి ఇదే అత్యంత అనుకూలమైన ప్లేస్ అని చెప్పడమే కాదు.. తాను ఎలాంటి రిలాక్సేషన్ పొందుతోందో చూపించింది కూడా.

ఒంటిపై కేవలం టవల్ మాత్రమే కట్టుకుని.. బాత్ టబ్ లో స్నానానికి సిద్ధమైంది షెహనాజ్. అయితే.. ఇదేమీ మామూలు స్నానం కాదు. హాంకాంగ్ లో ఇదో స్పా కాబట్టి.. ఇక్కడ రకరకాల థెరపీలు ఉంటాయి. ఆ వాటర్ తోనే బాడీకి థెరపీ చేస్తారన్న మాట. దాని గురించి చెప్పేందుకు ఇలా సెక్సీ పోజ్ ఇచ్చి.. బాత్ టబ్ లో తనను చూపిస్తోంది షెహనాజ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/