Begin typing your search above and press return to search.

అండర్ వాటర్ లో గోల్డ్ స్పాట్ సుందరి

By:  Tupaki Desk   |   23 April 2016 3:30 PM GMT
అండర్ వాటర్ లో గోల్డ్ స్పాట్ సుందరి
X
2వేల సంవత్సరం వరకూ భారతీయ కూల్ డ్రింక్ మార్కెట్లో గోల్డ్ స్పాట్ ఓ సంచలనం. గోల్డ్ స్పాట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా షెహనాజ్ చాలా మందికి తెలుసు. ఇక మన తెలుగు ప్రేక్షకులకైతే.. 2001లో వచ్చిన నాగార్జున మూవీ ఎదురులేని మనిషిలో కుర్ర నాగ్ కు జంటగా నటించింది. బాలీవుడ్ లో కూడా బాగానే వెలిగింది. ఇష్క్ విష్క్ మూవీతో క్రేజ్ వచ్చినా.. దాన్ని ఫుల్ ప్లెడ్జెడ్ గా వాడుకోవడంలో మాత్రం ఫెయిలైది షెహనాజ్ ట్రెజరీవాలా.

ఇప్పటికీ అప్పుడప్పుడూ ఈ భామ నటించిన సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. చివరగా రెండేళ్ల క్రితం మై ఔర్ మిస్టర్ రైట్ అనే బాలీవుడ్ మూవీలో లీడ్ హీరోయిన్ గా కనిపించింది. మధ్యలో ఢిల్లీ బెల్లీ లాంటి హిట్ పిక్చర్స్ కూడా అమ్మడి ఖాతాలో ఉన్నాయి. ఓ తరానికి ముందే టాప్ మోడల్ స్టేటస్ అనుభవించిన ఈ సుందరాంగిలో.. ఇంకా హీట్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ హాట్ హాట్ పోజులిస్తూ జనాల నోళ్లలో తెగ నానుతూ ఉంటుంది. రీసెంట్ గా అండర్ వాటర్ లో అరకొరా స్విమ్మింగ్ డ్రస్ వేసుకుని దిగిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది షెహనాజ్.

అసలు ఎక్స్ పోజింగ్ అంటే ఇలా ఉంటుంది, క్లీవేజ్ షోకి మీనింగ్ ఇది, తడి సొగసులను ప్రదర్శించడం ఇలా.. అన్నట్లుగా ఉంది షెహనాజ్ వాలకం. ఇదంతా ఛాన్సుల కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఈ ఫోటోలు చూశాకైనా.. బాలీవుడ్ దర్శకనిర్మాతలు కరుణిస్తారేమో చూడాలి.