Begin typing your search above and press return to search.

ప్రెగ్నెంట్ హీరోయిన్.. తాగేసి రచ్చ

By:  Tupaki Desk   |   2 April 2016 4:24 AM GMT
ప్రెగ్నెంట్ హీరోయిన్.. తాగేసి రచ్చ
X
షెనాజ్ ట్రెజరీ వాలా గుర్తుందా? షాహిద్ కపూర్ లాంఛిగ్ మూవీ ఇష్క్ విష్క్ లో సందడి చేసిన ఈ సుందరి.. ఆ తర్వాత కూడా చాలానే సినిమాల్లో చేసింది. ఈ భామ చేసిన మూవీస్ సంఖ్య తక్కువే అయినా ఇండస్ట్రీ చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించడం విశేషం. అయితే, ఇప్పుడీ భామ ఓ పార్టీలో తాగేసి నానా రచ్చ చేసేసింది.

ఫుల్లుగా మందు కొట్టేసి ఉండడమే కాదు.. అప్పటికే దాదాపు 6 నెలల కడుపుతో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పైగా ఆ పార్టీలో ఉన్న చాలామంది మగవాళ్ల దగ్గరకెళ్లి ఏకంగా సెక్స్ గురించి డిస్కషన్స్ కూడా పెట్టేయడంతో ఎవరికీ నోట మాట రాలేదు. నా బేబీకి నువ్వు తండ్రివి అవుతావా అని అడగడంతో చాలామంది అవాక్కైపోయారు.

అయితే.. ఇదంతా షెనాజ్ కావాలని చేసింది. ఈ సుందరి ఓ యూట్యూబ్ ఛానల్ మెయింటెయిన్ చేస్తోంది. అందులో సరదా సరదా వీడియోలు పోస్ట్ చేయడం ఈమె హాబీ. అందులో భాగంగా ఇలా ఓ ప్రాంక్ షో ప్లాన్ చేసింది. ఏప్రిల్ ఫస్ట్ కావడంతో.. తాను కడుపుతో ఉన్నట్లు అందరికీ కలరింగ్ ఇచ్చి ఫూల్స్ చేసేసింది. తనపై తనే ప్రాక్టికల్ జోక్ వేసుకున్న ఈ ఏప్రిల్ ఫూల్ వీడియోకి ఆన్ లైన్ రియాక్షన్ బాగానే ఉంది.