Begin typing your search above and press return to search.

వర్మా.. మరీ ఇంత చీప్ గానా?

By:  Tupaki Desk   |   9 May 2017 3:55 PM GMT
వర్మా.. మరీ ఇంత చీప్ గానా?
X
సీనియర్ దర్శకుడు శేఖర్ కపూర్ ని దేశీయ సినీ అభిమానులకు పరిచయం చేయాల్సిన పని లేదు. పలు హాలీవుడ్ చిత్రాలను తీసిన ఈయన.. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్ లీ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ మూవీకి నిర్మాత కూడా శేఖర్ కపూర్ కావడం విశేషం. బ్రూస్ లీ కూతురు షానోన్ లో సహకారంతో స్క్రిప్ట్ రైటింగ్ పనులు చేసుకుంటున్నాడు శేఖర్ కపూర్.

1950ల కాలంలో హాంకాంగ్ ఎలా ఉండేదనే అంశంపై సెట్స్ వేసి.. ఆ సమయంలో బ్రూస్ లీ అంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగాడనే విషయాన్ని బ్రూస్ లీ బయోపిక్ లో చూపించాలన్నది శేఖర్ కపూర్ ఆలోచన. ఈ హాలీవుడ్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు బయటకు రాగానే.. బ్రూస్ లీ వీరాభిమానిగా చెప్పుకునే రాంగోపాల్ వర్మకు ఓ కొత్త ఆలోచన వచ్చేసింది. 'నాకు బ్రూస్ లీ అంటే దైవంతో సమానం. అందుకే ఆయనపై ఓ బయోపిక్ తీసి.. శేఖర్ కపూర్ తీసే సమయానికే విడుదల చేస్తాను. శేఖర్ కపూర్ తో నాకు ఎటువంటి విబేధాలు లేవు.. ఇదంతా కేవలం బ్రూస్ లీపై అభిమానంతో మాత్రమే' అంటున్నాడు వర్మ.

బ్రూస్ లీ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలు.. శేఖర్ కపూర్ తెలివితేటలతో తెరకెక్కే సినిమాకు.. తన సినిమాకు తేడా చూసి.. ఎవరు న్యాయం చేశారో చెప్పాలంటున్నాడు రాంగోపాల్ వర్మ. అంత భక్తి ఉన్నట్లయితే ముందే తీయచ్చు కదా వర్మా.. మరో దిగ్గజ దర్శకుడు ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాక.. ఈ హంగామా ఎందుకంట.. మరీ చీప్ గా లేదూ!