Begin typing your search above and press return to search.

ధనుష్ ను కలసిన శేఖర్ కమ్ముల - నిర్మాతలు..!

By:  Tupaki Desk   |   2 July 2021 10:00 PM IST
ధనుష్ ను కలసిన శేఖర్ కమ్ముల - నిర్మాతలు..!
X
కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ - సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై ఈ సినిమా రూపొందనుంది. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ - పి.రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. తెలుగు తమిళం హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. ఇద్దరు నేషనల్ అవార్డ్ విన్నర్స్ కలిసి వర్క్ చేయనున్నట్లు అనౌన్స్మెంట్ రావడంతో.. ఈ అరుదైన కలయిక గురించి ఫిలిం సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

అయితే క్రేజీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్న హీరో - దర్శక నిర్మాతలు ఈరోజు శుక్రవారం కలిశారు. #D43 షూటింగ్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ధనుష్.. శేఖర్ కమ్ముల - నారాయణదాస్ నారంగ్ - సోనాలి నారంగ్ - భరత్ నారంగ్ మరియు పి.రామ్ మోహన్ లను కలసి కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. కాగా, ఇది ధనుష్ తెలుగులో నటిస్తున్న ఫస్ట్ స్ట్రైయిట్ మూవీ. దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు స్టార్ హీరో చెప్పుకొచ్చారు.

యూనివర్సల్ అప్పీల్‌ ఉన్న కథతో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం వివిధ భాషలకు చెందిన బిగ్ స్టార్స్ మరియు అత్యున్నత సాంకేతిక బృందంతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తారు. ధనుష్ - శేఖర్ కమ్ముల వంటి ఇద్దరు ప్రతిభావంతులు కలసి చేయనున్న త్రిభాషా చిత్రం.. ఈ ఏడాది ఎప్పుడైనా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.