Begin typing your search above and press return to search.

యాంగ్రీ మ్యాన్ 'శేఖర్' చేతులు మారింది..

By:  Tupaki Desk   |   22 Nov 2021 9:36 AM GMT
యాంగ్రీ మ్యాన్ శేఖర్ చేతులు మారింది..
X
'కల్కి' సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న సీనియర్ హీరో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ''శేఖర్'' అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. 'మ్యాన్ విత్ ది స్కార్' (మచ్చల మనిషి) అనేది దీనికి ఉపశీర్షిక. జీవిత రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి లలిత్ కుమార్ అనే యువ దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్లు గతంలో రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి జీవిత స్క్రీన్ ప్లే - దర్శకత్వం వహిస్తున్నారని వెల్లడిస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్ గ్లిమ్స్ అప్డేట్ ఇచ్చారు.

‘శేఖర్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని నవంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా వదిలిన పోస్టర్ లో రాజశేఖర్ బుల్లెట్ మీద కూర్చొని సీరియస్ గా ఆలోచిస్తూ ఉన్నారు. తెల్ల గెడ్డంతో రాజశేఖర్ రఫ్‌ లుక్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. సీనియర్ హీరో తన 91వ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారనే విషయాన్ని ఈ పోస్టర్ తెలియజేస్తోంది. ఇది మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ చిత్రానికిది రీమేక్ అని తెలుస్తోంది. ఓ ఇంటెలిజెంట్ రిటైర్డ్ పోలీసాఫీసర్ నగరంలో సంచలనం రేపిన ఓ క్రిమినల్ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఆ కేసును ఛేదించాడా లేదా? అనేదే ఈ సినిమా కథ.

గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో ఆసక్తికరమైన సన్నివేశాలతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా 'జోసెఫ్' సినిమా సాగుతుంది. జోజు జార్జ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ ''శేఖర్'' అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన సీనియర్ హీరో.. ఇందులో పూర్తిగా సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో ఆకట్టుకుంటున్నారు. ఇందులో అను సితార - ముస్కాన్ కూబ్ చాందిని ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని టాక్.

''శేఖర్'' చిత్రాన్ని పెగాసస్ సినీ కార్పొరేషన్ - సుధాకర్ ఇంపెక్స్ ఐపియల్ - త్రిపురా క్రియేషన్స్ - టారాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంకాయలపాటి మురళీ కృష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రానికి బీరం సుధాకర్ రెడ్డి - శివాని రాజశేఖర్ - శివాత్మిక రాజశేఖర్ - బొగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మాతలు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి మల్లిఖార్జున నారగాని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్నివిడుదలకు సిద్ధం చేస్తున్నారు.

గతంలో రాజశేఖర్ హీరోగా 'సత్యమేవ జయతే' 'మహాకాళి' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన జీవిత.. ఇప్పుడు ''శేఖర్'' చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఇకపోతే ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి బరిలో నిలిపే అవకాశం ఉందని టాక్ వచ్చింది. ఈ నెల 25న రాబోయే ఫస్ట్ గ్లిమ్స్ ద్వారా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.