Begin typing your search above and press return to search.

'శేఖర్' యాక్షన్ షురూ చేసిన రాజశేఖర్..!

By:  Tupaki Desk   |   11 Aug 2021 10:30 AM GMT
శేఖర్ యాక్షన్ షురూ చేసిన రాజశేఖర్..!
X
కల్కి' సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్.. ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా ''శేఖర్'' అనే సినిమాని అనౌన్స్ చేశారు. 'మ్యాన్ విత్ ది స్కార్' (మచ్చ ఉన్న వ్యక్తి) అనేది దీనికి ఉపశీర్షిక. సీనియర్ హీరో కెరీర్‌ లో 91వ సినిమాగా వస్తున్న 'శేఖర్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. తెల్ల గెడ్డంతో రఫ్‌ లుక్‌ లో కనిపించిన రాజశేఖర్ అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇందులో ఆయన విశ్రాంత పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. క‌రోనా సెకండ్ వేవ్ ప్రభావంతో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.

'శేఖర్' సినిమా షూటింగ్ ఈరోజు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్ర బృందం ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియజేసింది. ఇందులో తెల్లని జుట్టుతో స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తున్న హీరో రాజ‌శేఖ‌ర్ బ్యాక్ సైడ్ లుక్ ని చూపించారు. లలిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. లక్ష్య ప్రొడక్షన్స్ మరియు పెగాసస్ సినీ కార్పొరేషన్ బ్యానర్స్ పై ఎంఎల్వి సత్యనారాయణ - శివాని శివాత్మిక - వెంకట శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ భూపాల స్టోరీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇకపోతే ‘గ‌తం’ ఫేమ్ కిర‌ణ్ కొండ‌మ‌డుగ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నాడు. '#RS92' అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని ఆఫ్ బీట్ ఫిలిమ్స్ - ఎస్ ఒరిజినల్స్ - పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అలానే 'కేరాఫ్ కంచరపాలెం' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా తో యాంగ్రీ హీరో 'మర్మాణువు' అనే సినిమాలో నటిస్తున్నాడు. పెగాసస్ సినీ కార్పొరేషన్ - మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇదే క్రమంలో యాక్షన్ హీరో గోపీచంద్ తో కలిసి రాజశేఖర్ ఓ మల్టీస్టారర్ మూవీ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.