Begin typing your search above and press return to search.

ఒకే పాత్ర ఎన్నిసార్లు చేయాలిః న‌టి

By:  Tupaki Desk   |   13 Jun 2021 5:00 AM IST
ఒకే పాత్ర ఎన్నిసార్లు చేయాలిః న‌టి
X
ఆర్టిస్టులు అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ ఉంటారు. కానీ.. టాలెంటెడ్ మాత్రం కొంద‌రే ఉంటారు. అలాంటి కొంద‌రిలో బాలీవుడ్ న‌టి షెఫాలీ షా త‌ప్ప‌కుండా ఉంటారు. స్టేజీ ఆర్టిస్టు నుంచి మొద‌లై, బుల్లితెర మీదుగా వెండి తెర‌మీద వెలిగిన షెఫాలీ.. త‌న టాలెంట్ ను అడుగ‌డుగునా నిరూపించుకుంది. కానీ.. ఎందుకో ఆమె టాలెంట్ కు ద‌క్కాల్సిన పాత్ర‌లు ద‌క్క‌లేద‌నే చెప్పాలి. ఇదే ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు షెఫాలీ.

తాజాగా.. సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించారు షెఫాలీ. ఇన్ స్టాగ్రామ్ లో క్వ‌శ్చ‌న్ అవ‌ర్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ ప‌లు ప్ర‌శ్న‌లు వేశారు. వాట‌న్నింటికీ స‌మాధానాలు ఇచ్చారు షెఫాలీ. ఈ సంద‌ర్బంగా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే పాత్ర‌ల గురించి మాట్లాడారు. త‌న వ‌ద్ద‌కు అన్నీ త‌ల్లి పాత్ర‌లే రావ‌డం ప‌ట్ల ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

త‌న‌కు 20 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న‌ప్పుడే 45 ఏళ్ల న‌టుడికి త‌ల్లిగా న‌టించాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. ఇదే వ‌య‌సులో.. ఓ టీవీ షోలో 15 ఏళ్ల అబ్బాయికి త‌ల్లిగా న‌టించాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. ఈ విధంగా సినీ కెరీర్లో అత్యంత త్వ‌ర‌గా త‌ల్లిపాత్ర‌లు పోషించిన షెఫాలీకి.. ఆ త‌ర్వాత కూడా అవే పాత్ర‌లు వ‌చ్చిన‌ట్టు తెలిపింది.

ఈ కార‌ణంగానే ప‌లు సినిమాల‌ను వ‌ద‌లుకున్న‌ట్టు చెప్పారు. ప్ర‌స్తుతం షెఫాలీ వ‌య‌సు 48 సంవ‌త్స‌రాలు. త‌న‌కు మూడు ప‌దుల వ‌య‌సు కూడా లేన‌ప్పుడే.. అక్ష‌య్ కుమార్ కు త‌ల్లిగా న‌టించిన‌ట్టు చెప్పారు. ఈ విధంగా అన్నీ.. త‌ల్లిపాత్ర‌లే రావ‌డంతో రిజెక్ట్ చేస్తున్న‌ట్టు చెప్పారు. ఈ రొటీన్ క్యారెక్ట‌ర్స్ బోర్ గా ఉన్నాయ‌న్న ఆమె.. ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లు వ‌స్తేనే.. అంగీక‌రిస్తున్న‌ట్టు చెప్పారు.