Begin typing your search above and press return to search.

'జిన్నా' ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో కి వెళ్లిన ఆమెకి షాక్

By:  Tupaki Desk   |   24 Oct 2022 5:32 AM GMT
జిన్నా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో కి వెళ్లిన ఆమెకి షాక్
X
మంచు విష్ణు హీరోగా రూపొందిన జిన్నా సినిమా నిరాశ పరిచింది. గత చిత్రం మోసగాళ్లు స్థాయిలోనే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిందని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. మొదటి రోజు సినిమా వసూళ్లు మరీ తక్కువగా ఉండటంతో చాలా చోట్ల రెండవ ఆట నుండే షో లు క్యాన్సిల్‌ చేసినట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఒక వీడియో యూట్యూబ్‌ లో తెగ చక్కర్లు కొడుతోంది. విజయవాడకు చెందిన ఒక యువతి మాట్లాడుతూ తాను మంచు విష్ణు పై అభిమానంతో జిన్నా సినిమాను మొదటి రోజు మొదటి ఆట చూసేందుకు గాను పీవీపీ మాల్‌ లో టికెట్‌ ను బుక్ చేసుకోవడం జరిగింది.

సినిమాను చూసేందుకు లోనికి వెళ్లాను. స్క్రీన్‌ ఓపెన్ అయ్యింది.. యాడ్స్ ను ప్లే చేస్తున్నారు. అప్పటి వరకు కూడా హాల్‌ మొత్తం ఇద్దరం ముగ్గురం మాత్రమే ఉన్నాం. యాడ్స్ ప్లే పూర్తి అయిన తర్వాత కూడా జనాలు రాకపోవడంతో షో ను రద్దు చేస్తున్నట్లుగా థియేటర్ సిబ్బంది వచ్చి మమ్ములను పక్కన ఆడుతున్న ఓరి దేవుడా సినిమాకు వెళ్లాల్సిందిగా నాకు షాక్ ఇచ్చారు అని ఆ యువతి పేర్కొంది.

ఆమె అందుకు సంబంధించిన టికెట్‌ ను కూడా యూట్యూబ్‌ లో పోస్ట్‌ చేసిన తన వీడియోలో పేర్కొంది. మొదటి రోజు మొదటి ఆటకే ఇలా జరగడం చాలా దారుణమైన విషయం గా మంచు విష్ణు పరిస్థితి గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మొదటి షో చాలా చోట్ల ఏదో రకంగా పడినా రెండవ షో నుండి చాలా చోట్ల అలాంటి పరిస్థితులే కనిపించాయట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.