Begin typing your search above and press return to search.

అమ్మ రాసిన లెటర్ ను షేర్‌ చేసి ఎమోషనల్‌ అయ్యింది

By:  Tupaki Desk   |   25 Feb 2021 9:25 AM IST
అమ్మ రాసిన లెటర్ ను షేర్‌ చేసి ఎమోషనల్‌ అయ్యింది
X
అతిలోక సుందరి శ్రీదేవి తన వారసురాలిగా జాన్వీ కపూర్‌ ను హీరోయిన్ గా చేయాలని కలలు కన్నారు. కూతురును హీరోయిన్‌ చూడకుండానే శ్రీదేవి కన్నుమూశారు. జాన్వీ కపూర్‌ మొదటి సినిమా ప్రారంభం అయిన సమయంలో శ్రీదేవి ఉన్నారు. కాని ఆ సినిమా విడుదల సమయంలో శ్రీదేవి ఈ లోకంలో లేకుండా వెళ్లి పోయారు. తల్లితో ఎక్కువ బాండింగ్ ఉన్న జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తల్లి గురించి ఏదో ఒక పోస్ట్‌ పెడుతూనే ఉంది. తాజాగా ఈమె తల్లి వర్ధంతి సందర్బంగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. తనకు చాలా ఏళ్ల క్రితం తల్లి శ్రీదేవి స్వ హస్తాలతో రాసిన ఒక లేఖను సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

'ఐ లవ్‌ యూ మై లబ్బు, యు ఆర్‌ ది బెస్ట్‌ బేబీ ఇన్‌ ది వరల్డ్' అంటూ శ్రీదేవి రాసిన లేఖ ను జాన్వీ కపూర్‌ పంచుకుని నీవు లేని ఈ ప్రపంచంను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాం.. కుటుంబం నీ లోటుతో బాధపడుతుంది అన్నట్లుగా కామెంట్ పెట్టింది. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూ నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న జాన్వీ కపూర్‌ ఈ సమయంలో తన తల్లి పక్కన లేక పోవడం ఎంతో బాధగా ఉంది అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ 'రూహి' సినిమాలో నటిస్తోంది. రాజ్‌ కుమార్‌ రావు నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ ప్రత్యేకంగా కనిపించబోతుంది. అలాగే ఒక తమిళ సినిమా లో కూడా ఫీమేల్ లీడ్‌ రోల్‌ లో కనిపించేందుకు జాన్వీ కపూర్‌ సిద్దం అవుతోంది.