Begin typing your search above and press return to search.

ఆమె నిజంగా ఫైలెటే! ప్రేక్షకుల ప్రశ్నలకు ఆన్సర్​ దొరికేసింది!

By:  Tupaki Desk   |   16 Nov 2020 9:50 AM GMT
ఆమె నిజంగా ఫైలెటే! ప్రేక్షకుల ప్రశ్నలకు ఆన్సర్​ దొరికేసింది!
X
ఇటీవలే అమెజాన్‌లో విడుదలైన ‘ఆకాశం నీ హద్దు రా’ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకుంటున్నది. ఎయిర్ ఇండియా వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ ఆటో బయోగ్రఫీ ‘సింప్లీ ఫ్లై’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళహీరో సూర్య లీడ్​రోల్​ను పోషించగా.. సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం క్లైమాక్స్‌లో ఓ లేడీ పైలట్ కనిపిస్తుంది. ఆమె ఎవరా అని నెటిజన్లు తెగ సెర్చ్​ చేస్తున్నారట. అయితే ఆమె గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఆమె రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ పైలట్టే నట. ఇండిగో సర్వీసులో పైలట్ గా సేవలు అందిస్తున్నారు వర్ష ఈ చిత్రంలో ఫైలట్​గా నటించారు.

ఆమె భర్త లోగేశ్ ఎయిరిండియాలో పైలట్. కేరళ వాసి అయిన వర్షా చెన్నైలో ఉంటున్నారు. క్లైమాక్స్ లో ఆమెను చూసిన వారంతా వర్షాకు అభిమానులు అయిపోయారు. చెక్ చేసి వివరాలు తెలుసుకుని నిజంగా పైలట్ అని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారంతా. 'ఆకాశం నీ హద్దు రా’ చిత్రానికి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి భారీ ప్రశంసలు దక్కుతున్నాయి. సినీ క్రిటిక్స్​ నుంచి కూడా ఈ చిత్రానికి పాజిటివ్​ రెస్పాన్స్​ వచ్చింది. ఓ జీవిత చరిత్రను సుధాకొంగర ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారని సినీ క్రిటిక్స్​ అభిప్రాయపడుతున్నారు.

సూర్య లాంటి భారీ మార్కెట్​ ఉన్న ఓ హీరో ఇటువంటి పాత్ర చేయడాన్ని కూడా పలువురు ప్రశంసిస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వంపై ఇప్పడు జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. ఓ మహిళ దర్శకులు స్టార్​హీరోను డైరెక్ట్​ చేసి భారీ విజయాన్ని సాధించడం విశేషం. ఏపీలోని విశాఖపట్టణంలో జన్మించిన సుధా.. చెన్నైలో స్థిరపడ్డారు. ఆమె చాలా కాలంపాటు ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద అసిస్టెంట్​గా పనిచేశారు. వెంకటేశ్​ కథానాయకుడిగా నటించిన ‘గురు’ చిత్రానికి కూడా ఆమె దర్శకత్వం వహించారు.