Begin typing your search above and press return to search.
‘బిగ్ బాస్’ విన్నర్ ఆమె.. ప్రకటించిన గూగుల్!
By: Tupaki Desk | 4 Feb 2021 9:00 PM ISTబిగ్ బాస్ సీజన్ ముగిసిపోయింది కదా..! విజేతను కూడా ప్రకటించారు కదా..! మళ్లీ గూగుల్ విన్నర్ ను డిక్లేర్ చేయడమేంటని అనుకుంటున్నారా? అయితే.. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది తెలుగు సీజన్ గురించి కాదు. హిందీ బిగ్ బాస్ సీజన్-14 గురించి.
ప్రస్తుతం.. హిందీ బిగ్ బాస్ సీజన్ షో-14 ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 21న బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ సీజన్ విజేత ఎవరనేది హోస్ట్ సల్మాన్ ఖాన్ ఆ రోజున అనౌన్స్ చేయనున్నారు. విజేత ప్రకటించడానికి ముందు ఎంత డ్రామా నడుస్తుందో అందరికీ తెలిసిందే. కానీ.. ఈ సీజన్ విజేత ఎవరనేది మాత్రం ముందుగానే తేలిపోవడం గమనార్హం!
అన్ని భాషల్లోనూ క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ షో.. హిందీలో ఫుల్ జోష్ తో రన్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంపై చర్చ గట్టిగానే సాగుతోంది. ఈ సమయంలో విజేత ఎవరనేది గూగుల్ ముందుగానే కూసేయడం గమనార్హం. గూగుల్ సెర్చ్ బార్ లో ‘బిగ్ బాస్-14 విన్నర్ నేమ్’ అని టైప్ చేస్తే.. బిగ్ బాస్ కంటిస్టెంట్, ప్రముఖ బుల్లితెర నటి రుబీనాను విజేతగా చూపిస్తుండడం విశేషం.
దీంతో.. అందరూ అవాక్కవుతున్నారు. షో కంప్లీట్ కాకుండానే.. విజేతను గూగుల్ చూపిస్తుండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇది టెక్నికల్ సమస్య వల్ల చోటు చేసుకున్న
పొరపాటు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటీవల ‘కేజీఎఫ్-2’ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఓ పాత్రలో నటిస్తున్నట్టు గూగుల్ తప్పుగా చూపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి పొరపాటు రిజల్ట్ చూపిస్తుండడం గమనార్హం. ఇది చూసిన మనవాళ్లు ఊరికే ఉండరు కదా..! ఈ రిజల్ట్ ను స్క్రీన్ షాట్లు కొట్టి తెగ వైరల్ చేస్తున్నారు.