Begin typing your search above and press return to search.

యాంక‌రింగ్ లో నా గురువు త‌నేః సుమ

By:  Tupaki Desk   |   31 March 2021 5:00 AM IST
యాంక‌రింగ్ లో నా గురువు త‌నేః సుమ
X
సుమ మైకు ప‌ట్టుకుందంటే.. నిర్వాహ‌కులు రిలాక్స్ అయిపోవ‌చ్చ‌నేది ఇండ‌స్ట్రీ మాట‌. తెలుగులో యాంక‌ర్ గా అంత‌లా ముద్ర‌వేశారు సుమ‌. త‌న‌కు మాత్ర‌మే సొంత‌మైన మాట తీరు.. హ్యూమ‌ర్ క‌ల‌గ‌లిసిన స‌మ‌య‌స్పూర్తితో రెండు ద‌శాబ్దాలుగా వేదిక‌ల‌ను ఏలుతున్నారు. మ‌రి, ఈ స్థాయిలో సుమ యాంక‌రింగ్ చేయ‌డానికి కార‌ణం ఎవ‌రు అంటే.. త‌న గురువు అని చెబుతోంది సుమ!

సుమ తెలుగు అమ్మాయి కాదు అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. కేర‌ళ‌కు చెందిన సుమ‌.. తెలుగు నేర్చుకుని ఈ స్థాయిలో టాప్ యాంక‌ర్ గా కొన‌సాగుతున్నారంటే.. దాని వెన‌కున్న కృషి ఏ పాటిదో అర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌ల మీడియాతో మాట్లాడిన సుమ‌.. త‌న ప్ర‌స్థానం గురించి వివ‌రించారు.

మొద‌టి సారిగా 1991లో దూర ద‌ర్శ‌న్ లో యాంక‌రింగ్ చేసిన‌ట్టు చెప్పారు. ఆ త‌ర్వాత ప‌లు టీవీ సీరియ‌ళ్ల‌లో న‌టించిన సుమ‌, ప‌లు సినిమాల్లోనూ న‌టించారు. 'కళ్యాణ ప్రాప్తిరస్తు' అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కూడా చేశారు సుమ. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో కనిపించారు. ఆ తర్వాత తనంతట తానే మానేశాని తెలిపారు.

తాను సినిమాల్లో నటించడం భర్త రాజీవ్ కు ఇష్టం లేకపోవడం వల్లే వదిలేశానని చెప్పింది సుమ. ఆ తర్వాత నుంచి యాంకరింగ్ లో స్థిరపడిపోయానని తెలిపింది. అయితే.. సినిమా ఈవెంట్ అయినా.. టీవీ షో అయినా.. తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది సుమ. మరి, స్థాయిలో మాట‌కారిగా ఎవ‌రో మార్చారో తెలిపింది.

తాను యాంక‌ర్ గా సెన్సాఫ్ హ్యూమ‌ర్ తో ఇలా మాట్ల‌డ‌డానికి త‌న త‌ల్లి కార‌ణ‌మ‌ని చెప్పింది. చిన్న‌ప్పుడు ఇంట్లో అమ్మ స‌ర‌దాగా మాట్లాడేద‌ని, త‌న‌కు కూడా అదే అల‌వాటైంద‌ని తెలిపింది. ఆ విధంగా.. యాంక‌రింగ్ లో త‌న తొలి గురువు అమ్మ అని చెప్పింది సుమ‌.