Begin typing your search above and press return to search.

టార్గెట్ సెట్ చేసిన శౌర్య.. ఇకపై ప్రతీ శుక్రవారం 'లక్ష్య' అప్డేట్..!

By:  Tupaki Desk   |   23 July 2021 1:30 PM GMT
టార్గెట్ సెట్ చేసిన శౌర్య.. ఇకపై ప్రతీ శుక్రవారం లక్ష్య అప్డేట్..!
X
టాలెంటెడ్ హీరో నాగ శౌర్య కెరీర్ లో మైలురాయి 20వ చిత్రంగా ''లక్ష్య'' అనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రాచీన విలువిద్య (ఆర్చరీ క్రీడ) నేపథ్యంలో దర్శకుడు ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి రూపొందిస్తున్న ఈ చిత్రం ఎంటర్టైనింగ్ గా ఎగ్జైటింగ్ గా ఉండబోతోంది. శౌర్య ఈ మూవీలో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని స‌రి కొత్త‌ లుక్‌ లో క‌నిపించనున్నారు. చిత్రీక‌ర‌ణ చివరి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 'లక్ష్య' సినిమా ప్ర‌మోష‌న్స్ ను చిత్ర బృందం మొదలు పెడుతోంది.

#LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్ తో ప్ర‌తీ శుక్ర‌వారం 'ల‌క్ష్య' మూవీ నుండి ఒక కొత్త అప్డేట్ ను ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాధార‌ణంగా సినీ ప్రేమికులు ప్ర‌తి శుక్ర‌వారం సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. కాబ‌ట్టి 'లక్ష్య' టీమ్ ప్లాన్ చేసిన ఈ కొత్త త‌ర‌హా ప్ర‌మోష‌న్స్ త‌ప్ప‌కుండా సినిమాపై అంచనాలు పెంచేస్తాయని అనుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పబ్లిసిటీ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇండియాలోనే ఆర్చరీ నేపథ్యంలో రూపొందుతున్న మొట్ట మొదటి సినిమా ''లక్ష్య''. ఇందులో నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటుడు జగపతి బాబు - సచిన్ కేడ్కర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.