Begin typing your search above and press return to search.

మీటూ ఉద్యమంపై జోకులు వేసిన స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   7 Feb 2019 6:28 AM GMT
మీటూ ఉద్యమంపై జోకులు వేసిన స్టార్‌ హీరో
X
హాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని భాషల సినీ ప్రముఖులను టెన్షన్‌ కు గురి చేసిన మీటూ ఉద్యమం ఎంతో మంది స్టార్స్‌ పరువు పోయేలా చేసింది. పలువురు సినీ ప్రముఖులు కూడా మీటూ ఉద్యమంలో భాగంగా కొండరు ఆడవారు చేసిన ఆరోపణలతో కెరీర్‌ నాశనం అయ్యి కనిపించకుండా పోయారు. మీటూ ఉద్యమం ఈమద్య కాస్త చల్లారినట్లుగానే అనిపిస్తుంది. ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు బయట పెట్టిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే తాను గతంలో చేసిన పనులను ఎవరు బయట పెట్టక పోవడం ఆశ్చర్యంగా ఉందని బాలీవుడ్‌ ఒకప్పటి స్టార్‌ హీరో శత్రుఘ్న సిన్హా చెప్పుకొచ్చాడు.

తాజాగా ఈయన ఒకానొక సందర్బంలో మాట్లాడుతూ.. అప్పట్లో నేను ఎన్నో చేశాను, అవి బయటకు రాకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీటూ వంటి గాలి వానలో తాను కొట్టుకు పోతానని కొందరు భావించారు. కాని నాకేం కాలేదు. నా రాసలీలలు ఎవరు బయట పెట్టకపోవడం నాకు సంతోషం కలిగించే విషయమే.

ఇక ప్రతి మగాడి సక్సెస్‌ వెనుక ఒక ఆడది ఉన్నట్లుగానే ప్రతి సక్సెస్‌ ఫుల్‌ మగాడి నాశనం వెనుక కూడా ఒక స్త్రీ ఉంటుందని కామెడీ చేశాడు. అంటే సక్సెస్‌ ఫుల్‌ కెరీర్‌ తో దూసుకు పోతున్న వారి కెరీర్‌ ను మీటూ ఉద్యమం పేరుతో కొందరు ఆడవారు నాశనం చేస్తున్నారనేది శత్రుఘ్న సిన్హా అభిప్రాయం. ఇండైరెక్ట్‌ గా మీటూ ఉద్యమం గాడి తప్పింది అనేది ఆయన అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. శత్రఘ్న సిన్హా కామెంట్స్‌ ను మహిళ సంఘాల వారు కొందరు తప్పుబడుతున్నారు. మీటూ ఉద్యమంపై బురద జల్లెలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.