Begin typing your search above and press return to search.

సిన్హా గర్జిస్తే వెనక్కి తగ్గిన అలనాటి స్టార్ హీరో..

By:  Tupaki Desk   |   16 April 2020 1:40 PM IST
సిన్హా గర్జిస్తే వెనక్కి తగ్గిన అలనాటి స్టార్ హీరో..
X
బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సిన్హా తన కూతురిపై అనుచిత వ్యాఖ్యాలు చేసినందుకు నటుడు ముకేశ్ ఖన్నాపై విరుచుకుపడ్డారు. 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ప్రోగ్రాంలో హనుమంతుడు ఎవరికోసం సంజీవనిని తీసుకువచ్చారని అమితాబ్ బచ్చన్ అడిగితే దానికి సోనాక్షి సిన్హా సమాధానం చెప్పలేకపోయింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో సోనాక్షిని నెటిజన్లు ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనను ఎత్తి చూపుతూనే ముఖేశ్ ఖన్నా ప్రత్యక్షంగా సోనాక్షిపై అసహనం వ్యక్తం చేశాడు.

దీంతో శత్రుఘ్న సిన్హా తాజాగా ఓ వెబ్‌సైట్‌కిచ్చిన ఇంటర్వూలో ముకేశ్ పేరు ఎత్తకుండానే పరోక్షంగా విరుచుకుపడ్డారు. "రామాయణంపై అడిగిన ఒక ప్రశ్నకు నా కూతురు సోనాక్షి సమాధానం చెప్పకపోవడం ఎవరికో సమస్యగా ఉందని అనుకుంటున్నాను. ముందుగా ఆ వ్యక్తికి రామాయణంపై నిపుణుడిలా వ్యవహరించడానికి ఏ అర్హత ఉంది. హిందూ మతం సంరక్షకుడిగా అతడిని ఎవరు నియమించారు? సోనాక్షితో సహా నా ముగ్గురు పిల్లలకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను.

సోనాక్షి కెరీర్‌ను నేను ప్రారంభించాల్సిన అవసరం లేదు. తన సొంత కాళ్లపై నిలబడి స్టార్‌ అయ్యింది. తనలాంటి కుమార్తె ఉన్నందుకు ఏ తండ్రి అయినా గొప్పగా ఫీల్‌ అవుతాడు. రామాయణ ప్రశ్నకు సోనాక్షి సమాధానం ఇవ్వకపోవడం ఆమెను హిందువు కాదని చెప్పలేదు. ఆమెకు ఎవరి నుంచి అర్హత పత్రం అవసరం లేదు" అంటూ ముకేశ్‌పై ఘాటు విమర్శలు చేశారు. దీంతో ముకేశ్ వెనక్కి తగ్గి త‌న మాట‌ల‌ను మీడియా వ‌క్రీక‌రించింద‌ని చెప్పుకొచ్చాడు. త‌ను ప్ర‌త్యేకంగా సోనాక్షిని టార్గెట్ చేయ‌లేద‌ని, యువ‌తరానికి రామాయ‌ణ‌, మహభార‌తాల గురించి తెలుసుకోవాలని చెప్పినట్లు జవాబిచ్చాడు. షాట్ గ‌న్ గ‌ర్జించే స‌రికి ముకేశ్ వివరణ ఇచ్చినట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది.