Begin typing your search above and press return to search.

మ‌హేష్ ని క‌లిసి కాంగ్రెస్ ఎంపీ.. ఏంటి క‌థాక‌మామీషు?

By:  Tupaki Desk   |   10 Sep 2021 2:30 PM GMT
మ‌హేష్ ని క‌లిసి కాంగ్రెస్ ఎంపీ.. ఏంటి క‌థాక‌మామీషు?
X
ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బుధవారం ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు ను క‌లిసారు. హైద‌రాబాద్ లోని ఓ హోట‌ల్లో కలిసిన తర్వాత థరూర్ ``ఎంతో సంతోషకరమైన వ్యక్తిత్వం`` అని ట్వీట్ చేశారు.

``హైదరాబాద్ లో సూపర్‌స్టార్ గురించి చెప్పాల్సిన దేం ఉంది. మేం తెరవెనుక చాట్ చేసినప్పుడు అతను తన తదుపరి సినిమా స‌ర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ‌లో విలన్ ను ఎదుర్కొని పడగొట్టడం పూర్తి చేసాడు`` అని థరూర్ పోస్ట్ చేసారు. హైదరాబాద్‌లోని మా ట్రైటెల్ హైడ్ లోని మా హోటల్ లో నేను నా సహోద్యోగి (అతని బావ గారు) జ‌య‌దేవ్ గ‌ల్లాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిశాను. ఎంత సంతోషకరమైన వ్యక్తిత్వం! అంటూ శ‌శి థ‌రూర్ ట్వీట్ చేశారు.


గల్లా జయదేవ్ లోక్ సభ సభ్యుడిగా.. తెలుగుదేశం పార్టీ(టిడిపి) నాయ‌కుడిగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగింపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పార్లమెంటరీ కమిటీ సభ్యులు శిల్పారామంలో మొక్కలు నాటారు. ప‌చ్చ‌ద‌నం పెంపుపై టీ.ఆర్.ఎస్ ఎంపీ చొరవను వారు ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లాలని అందరూ పిలుపునిచ్చారు. సంతోష్ కుమార్ ప్రయత్నాలను ప్రశంసిస్తూ.. మనం నాటిన మొక్కల ఫలాలను తరువాతి తరాలు ఆస్వాధించవచ్చని జాతి నిర్మాణం కూడా అదే అని భావించార‌ని ప్ర‌శంసించారు.

`సర్కారు వారి పాట`ను మైత్రి మూవీ మేకర్స్- GMB ఎంటర్ టైన్ మెంట్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లపై నవీన్ యెర్నేని- వై. రవిశంకర్- రామ్ ఆచంట- గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ ఎస్ఎస్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్స్ అందిస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్- వెన్నెల కిషోర్- సుబ్బరాజు త‌దిత‌రులు నటిస్తున్నారు. 13 జనవరి 2022 న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రాధే శ్యామ్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి ల `భీమ్లా నాయక్‌`తో ఢీకొంటుంది.

ప్రిన్స్ లా ప్ర‌త్య‌క్ష‌మైన మ‌హేష్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఇటీవ‌ల సూప‌ర్ ఫిట్ గా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. గౌత‌మ్ కృష్ణ‌కు సోద‌రుడిలా ఉన్నారంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఆయన ఏజ్ ఒక నంబ‌ర్ మాత్ర‌మేన‌ని నిరూపిస్తున్నారు. ఇక ఫిట్నెస్ లైఫ్ స్టైల్ ప్ర‌మోష‌న్స్ లోనూ మ‌హేష్ స్పీడ్ గానే ఉన్నారు. ఇంత‌కుముందు మహేష్ బాబు - నమ్రత ఓపెన్ మైయో మూవ్ మెంట్ లైఫ్ స్టైల్ క్లబ్ ని ప్రారంభించారు. అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

ఫిట్నెస్ ఔత్సాహిక జంట మహేష్ - నమ్రత క్ల‌బ్ యాక్టివిటీని ప్రారంభించారు. ఇది ఫిట్ నెస్- న్యూట్రిషన్- ఫిజియోథెరపీ విభాగాల్లో శిక్ష‌ణ క‌ల్పిస్తుంది. జీవనశైలి క్లబ్ శిక్షకుడు మినాష్ గాబ్రియేల్ ని మ‌హేష్ ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు.