Begin typing your search above and press return to search.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ తో శర్వానంద్ మాటా .. ముచ్చట!

By:  Tupaki Desk   |   15 Sep 2022 12:35 PM GMT
బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ తో శర్వానంద్ మాటా .. ముచ్చట!
X
శర్వానంద్ హీరోగా రూపొందిన 'ఒకే ఒక జీవితం' సినిమా ఈ నెల 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకత్వం వహించాడు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తల్లీ కొడుకుల ఎమోషన్ ను టైమ్ ట్రావెల్ తో ముడిపెడుతూ నడిపిన సినిమా ఇది. కాలంలో వెనక్కి వెళ్లి అమ్మ ప్రేమను పొందాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గరే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయింది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి సక్సెస్ టాక్ వచ్చింది.

తల్లి పాత్రలో అమల అందరినీ మెప్పించారు .. ఇక కొడుకు పాత్రలో శర్వానంద్ జీవించాడు. నాజర్ .. వెన్నెల కిశోర్ .. ప్రియదర్శి తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శర్వానంద్ కి ఉపశమనాన్ని కలిగించిన సినిమా ఇది. సక్సెస్ తో ఆయనకి ఊరటను ఇచ్చిన సినిమా ఇది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ముందు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన హను రాఘవపూడి ( సీతా రామం) .. వశిష్ఠ (బింబిసార).. చందూ మొండేటి (కార్తికేయ 2), 'ఒకే ఒక జీవితం'తో హిట్ కొట్టిన శర్వానంద్ - శ్రీకార్తీక్ లతో ముచ్చటించడం అనే కాన్సెప్ట్ తో ఈ చర్చా కార్యక్రమం నడిచింది.

'ఒకే ఒక జీవితం' ప్రస్తుతం థియేటర్స్ లో జోరుగానే నడుస్తోంది. ఇది కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్ కి సంబంధించిన సినిమా అనుకున్న కారణంగా ఓపెనింగ్స్ అంతగా లేవు. ఆ తరువాత మౌత్ టాక్ తో ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి.

టైమ్ ట్రావెల్ సినిమా తీయాలంటే భారీ బడ్జెట్ అవసరమని వెనకడుగు వేస్తూ వచ్చినవారందరినీ ఆశ్చర్యపరిచే సినిమా ఇది. ఒక వైపున సైన్స్ .. మరో వైపున ఎమోషన్ .. మధ్యలో కామెడీతో ఈ కథను దర్శకుడు బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు. అందువలన రొమాంటిక్ పాళ్లు తక్కువగా ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు.

ఈ సినిమా గురించి ష్ సర్వా మాట్లాడుతూ .. "నాగార్జునగారి ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూస్తుండగా ఆయన నన్ను హడావిడిగా పిలిచారు .. నేను ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాను. 'ఇది ఎలా జరిగింది శర్వా' అంటూ ఆయన నన్ను చాలా ఆత్రుతగా అడిగారు అంటూ ఆ రోజు జరిగిన సంఘటనను శర్వానంద్ వివరిస్తుంటే.

మిగతా వాళ్లంతా ఆసక్తిగా వింటున్నారు. మరి నాగార్జునకి ఏ విషయంలో ఎలాంటి సందేహం వచ్చిందన్నది పూర్తి ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియోను చూస్తే అర్థమవుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతో సాగిన ఈ మాటా మంతీ ఇంట్రెస్టింగ్ గానే అనిపించేలా ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.