Begin typing your search above and press return to search.

సింగిల్స్‌ గ్రూప్‌ నుండి శర్వా కూడా ఎగ్జిట్‌

By:  Tupaki Desk   |   25 Aug 2020 11:00 AM IST
సింగిల్స్‌ గ్రూప్‌ నుండి శర్వా కూడా ఎగ్జిట్‌
X
టాలీవుడ్‌ తో పాటు యావత్‌ సినీ ప్రపంచానికి 2020 ఒక చేదు జ్ఞాపకంగా నిలిచి పోనుంది. ఈ ఏడాదిలో కరోనా కారణంగా అన్ని భాషల్లో కూడా రెండు మూడు పెద్ద సినిమాల కంటే ఎక్కువ రాలేదు. ఈ ఏడాదిలో ఇండియన్‌ సినీ పరిశ్రమకు నష్టం వేల కోట్లల్లో వచ్చి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ సమయంలో టాలీవుడ్‌ లో మాత్రం కాస్త సందడి వాతావరణం కనిపిస్తోంది. వరుస పెళ్లిల కారణంగా టాలీవుడ్‌ లో షూటింగ్స్‌ లేని విషయంపై పెద్దగా చర్చ జరగడం లేదు. ఇప్పటికే జంటను వెతుకున్న స్టార్స్‌ సరసన శర్వానంద్‌ నిలువబోతున్నాడు.

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు నిఖిల్‌.. నితిన్‌.. రానాలు పెళ్లి పీఠలు ఎక్కేశారు. త్వరలో నిహారిక పెళ్లితో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొనబోతుంది. ఇదే సమయంలో యంగ్‌ స్టార్‌ హీరో శర్వానంద్‌ కూడా సింగిల్‌ గ్రూప్‌ ను వదిలేసి మింగిల్‌ అవ్వబోతున్నాడు. చాలా రోజులుగా ఆయన ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయంపై క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాని ఈసారి డైరెక్ట్‌ పెళ్లి ప్రకటనను శర్వా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.

ఉపాసన ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో శర్వా ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ రాలేదు. త్వరలో శర్వా తన ప్రేమ విషయాన్ని క్లారిటీ ఇవ్వడంతో పాటు పెళ్లి విషయాన్ని ప్రకటిస్తాడని అంటున్నారు. మరి శర్వా ఈ విషయమై ఎలా స్పందించబోతున్నాడు అనేది చూడాలి.