Begin typing your search above and press return to search.

శర్వా రెండు సార్లు సందీప్ వంగాకు నో..!

By:  Tupaki Desk   |   19 Dec 2018 2:14 PM IST
శర్వా రెండు సార్లు సందీప్ వంగాకు నో..!
X
యంగ్ హీరో శర్వానంద్ కు మంచి కథలు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగిపోతున్నాడు. సక్సెస్.. ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కంటెంట్ కు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలకు సైన్ చేస్తాడనే టాక్ ఉంది. కానీ శర్వానంద్ కూడా మిస్ అయిన క్రేజీ సినిమాలు ఉన్నాయి. 'అర్జున్ రెడ్డి' కోసం దర్శకుడు సందీప్ వంగా మొదట సంప్రదించిన హీరో శర్వానందే. కానీ శర్వా ఆ సినిమా చేయలేదు. అదే 'అర్జున్ రెడ్డి' విజయంతో విజయ్ దేవరకొండ క్రేజీ హీరో గా మారిపోయాడు.

సందీప్ వంగాకు మరో సారి కూడా నో చెప్పాడట శర్వా. 'పడి పడి లేచే మనసు' ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ 'అర్జున్ రెడ్డి' కథ తనకు నచ్చినా కొన్ని కారణాల వల్ల చేయలేదని అన్నాడు. అయితే తర్వాత సందీప్ తనవద్దకు మరో కథను తీసుకొచ్చాడని.. దానికీ 'నో' చెప్పానని వెల్లడించాడు. దీనికి ఒక కారణం ఉందట. తనకు కథ నచ్చడం మాత్రమే కాకుండా.. తన పాత్రలో నటించడానికి కంఫర్టబుల్‌ గా అనిపించాలట. అలా అనిపిస్తేనే ఏ సినిమానైనా యాక్సెప్ట్ చేస్తానని తెలిపాడు. ఒకరకంగా అదీ మంచిదేమో.. పాత్రతో హీరో ఐడెంటిఫై చేసుకోలేనప్పుడు బలవంతంగా అందులో నటించడం కంటే వదిలేయడమే మేలు కదా.

కారణాలేవైనా సందీప్ లాంటి క్రేజీ డైరెక్టర్ కు నో చెప్పడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇదిలా ఉంటే శర్వానంద్ తాజా చిత్రం 'పడి పడి లేచే మనసు' శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తన నెక్స్ట్ సినిమాను సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు.