Begin typing your search above and press return to search.

డాన్ శర్వా - ఫస్ట్ లుక్

By:  Tupaki Desk   |   25 May 2019 4:01 PM IST
డాన్ శర్వా - ఫస్ట్ లుక్
X
శర్వానంద్ కొత్త సినిమా రణరంగం ఫస్ట్ లుక్ అఫీషియల్ గా వచ్చేసింది. టైటిల్ కూడా దీంతో పాటే అనౌన్స్ చేశారు. దీని తాలూకు అప్ డేట్ కొన్ని గంటల క్రితమే తుపాకీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక లుక్ విషయానికి వస్తే చాలా రఫ్ లుక్ తో ఏజ్డ్ పాత్రలో శర్వానంద్ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ లెక్కన శర్వానంద్ పాత్ర గ్యాంగ్ స్టర్ గా ఎదిగి తన జీవితంలోని కీలక దశలను ఎలా దాటాడు అనే దాని మీద రణరంగం ఉండబోతోందనే క్లారిటీ వచ్చినట్టే.

ప్రపంచ మాఫియా సినిమాలకు ఎవర్ గ్రీన్ రిఫరెన్స్ గా నిలిచే గాడ్ ఫాదర్ లుక్ ని తలపించిన శర్వా కళ్ళలో ఎక్స్ ప్రెషన్స్ లో అదే ఇంటెన్సిటీ చూపించడం బాగుంది. ముఖ్యంగా ఎవరూ ఊహించని పాత్రలో శర్వానంద్ అభిమానులకు స్వీట్ షాక్ ఇవ్వబోతున్నాడు

ఇందులో కాజల్ అగర్వాల్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 1990 ప్రాంతంలో వైజాగ్ లో మొదలైన రణరంగం విదేశాలకు వెళ్లి తన కనుసైగతో ప్రపంచ నేర సామ్రాజ్యాన్ని శాశించే స్థాయికి ఎలా తీసుకెళ్ళింది అనే ప్లాట్ మీద రణరంగం రూపుదిద్దుకున్నట్టుగా టాక్. సుదీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఇటీవలే జెర్సీతో సూపర్ సక్సెస్ అందుకున్న సితార బ్యానర్ నిర్మిస్తోంది. ఆగస్ట్ 2 డేట్ లాక్ చేస్తూ ఇందులోనే కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. సాహో కంటే పదమూడు రోజులు ముందుగా శర్వా రణరంగం బాక్స్ ఆఫీస్ మీద దాడి చేయబోతోంది