Begin typing your search above and press return to search.

కిక్కిచ్చే లుక్కులో శర్వా

By:  Tupaki Desk   |   5 Jan 2019 11:55 AM IST
కిక్కిచ్చే లుక్కులో శర్వా
X
ఇటీవలే విడుదలైన పడి పడి లేచే మనసు ఫలితంతో షాక్ తిన్న శర్వానంద్ కష్టానికి తగ్గ ఫలితం దక్కనప్పటికీ కథల ఎంపికలో తన ప్రత్యేకతను మాత్రం నిలబెట్టుకున్నాడు. ఇక దీంతో పాటు సమాంతరంగా కొంతకాలం షూటింగ్ జరుపుకున్న దర్శకుడు సుధీర్ వర్మ చిత్రం మళ్ళి సెట్స్ పైకి వెళ్లనుంది. 90ల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో శర్వా ఓ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.

ఇకపోతే ఇందులో రెండు గెటప్స్ లో శర్వా కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. మధ్య వయసు దాటిన పాత్ర కోసం ప్రోస్తెటిక్స్ మేకప్ కూడా ఓకే చెప్పాడట శర్వా. ఇటీవలే చేసిన ట్రయిల్ ఫోటోలో శర్వా లుక్స్ సంతృప్తికరంగా రావడంతో సుధీర్ వర్మ ఇకపై స్పీడ్ పెంచనున్నట్టు తెలిసింది. హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శిని హిరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్ కూడా వేశారు. దీని విడుదల గురించి క్లారిటీ రావడానికి మాత్రం కొంత టైం పట్టేలా ఉంది. సమ్మర్ లోపు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇంకో 30 శాతం మాత్రమే బాలన్స్ ఉంది. అందులోనే ఈ మిడిల్ ఏజ్ పాత్ర రావొచ్చని సమాచారం. విరాటపర్వం 1990 అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ అధికారిక సమాచారం లేదు. మహానుభావుడు తర్వాత పడి పడి లేచే మనసుకు ఏడాది గ్యాప్ తీసుకున్న శర్వానంద్ ఇకపై కాస్త స్పీడ్ పెంచే ప్లాన్ లో ఉన్నాడు.