Begin typing your search above and press return to search.
శర్వానంద్ హీరోయిన్ ఫిక్సయింది
By: Tupaki Desk | 10 Jun 2015 7:00 PM ISTగత ఏడాది 'రన్ రాజా రన్'తో కెరీర్లో అతి పెద్ద కమర్షియల్ సక్సెస్ కొట్టిన శర్వానంద్.. ఈ ఏడాది 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'తో మరో కూల్ మూవీ ప్రేక్షకులకు అందించాడు. శర్వా తర్వాతి సినిమా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' ఫేమ్ మేర్లపాక గాంధీతో ఫిక్సయిన సంగతి తెలిసిందే. రన్ రాజా రన్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాన్నాళ్ల కిందటే సినిమా ఖరారైనా.. ప్రి ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యమవుతుండటం వల్ల షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.
శర్వాకు హీరోయిన్ ఎవరనే విషయంలో చాలా ఆప్షన్స్ పరిశీలించిన గాంధీ.. ఓ దశలో హిమాని సిసోడియా అనే కొత్తమ్మాయికి అవకాశం ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఐతే ఆమెకు ఫొటో షూట్ చేశాక మనసు మార్చుకున్నాడని.. చివరికి తమిళమ్మాయి సురభిని ఖరారు చేశాడని సమాచారం. తమిళంలో బిజీగా ఉన్న సురభి.. సందీప్ కిషన్ సినిమా 'బీరువా'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ 'అటాక్'లోనూ అవకాశం దక్కించుకుంది. ఆ రెండింటితో పోలిస్తే.. శర్వా సినిమా ఆమెకు పెద్ద ఆఫర్ అనే చెప్పాలి.