Begin typing your search above and press return to search.
హాట్ టాపిక్ గా మారిన శర్వానంద్ లిప్ కిస్!
By: Tupaki Desk | 24 Sept 2021 1:00 PM ISTఅజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' రూపొందింది. భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో, శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా నటించారు. వారి సరసన నాయికలుగా అదితీ రావు - అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు. లవ్ ... రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ సినిమా నడవనుంది. దసరా కానుకగా వచ్చేనెల 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్, ఆయా పాత్రల స్వరూప స్వభావాలను ఆవిష్కరించింది. అంతేకాదు ఒకానొక ఫ్రేమ్ లో శర్వానంద్ లిప్ కిస్ .. ఈ ట్రైలర్ ను పదే పదే వెనక్కిలాగి చూసేలా చేసింది. పద్ధతిగా ప్రేమించుకుందాం .. అంతే పద్దతిగా పెళ్లి చేసుకుందాం అనే పాత్రలనే ఇంతవరకూ చేస్తూ వచ్చిన శర్వనాద్, హఠాత్తుగా ఇలా లిప్ కిస్ లు ఇచ్చేసరికి యూత్ కూడా ఒక్కసారిగా తడబడింది .. నిదానంగా తేరుకుని నిలబడింది.
ఇదేంట్రా బాబు ఊహించని విధంగా ఒక్కసారిగా లిప్ కిస్ పెట్టేశాడని చెప్పుకుంటున్నారు.
శర్వానంద్ తన సినిమాలో లిప్ కిస్ లు ఉండకూడదనే ఒక నియమం పెట్టుకుని, ఇంతవరకూ ఆ నియమాన్ని అతిక్రమించకుండా చాలా జాగ్రత్తగా కెరియర్ ను నెట్టుకుంటూ వస్తున్నాడు. సిట్యువేషన్ డిమాండ్ చేస్తే హీరోయిన్లు బికినీలు వేసినట్టు, శర్వానంద్ విషయంలోను సిట్యువేషన్ డిమాండ్ చేసి ఆ లిప్ కిస్ ను ఆడియన్స్ కి సప్లై చేసిందనే అనుకోవాలేమో. ఏదేమైనా శర్వానంద్ .. అనూ ఇన్నమాన్యుయెల్ కి చేసిన లిప్ కిస్ ఇప్పుడు కుర్రాళ్ల గుండెల్లో అగ్గి రాజేస్తోంది. హాట్ టాపిక్ గా మారిపోయి హల్ చల్ చేస్తోంది.
ఇంతవరకూ వైజాగ్ లో అత్యధిక రోజుల పాటు షూటింగు జరుపుకున్న సినిమా ఇదేనని అజయ్ భూపతి చెబుతున్నాడు. 70 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగును కొనసాగించమని అన్నాడు. ఇది ఒక ఎమోషనల్ జర్నీ అనీ .. వైలెంట్ లవ్ స్టోరీ అని చెప్పాడు. సంగీతం .. ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలమని అన్నాడు. ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.