Begin typing your search above and press return to search.

క్రైమ్ సినిమాను కూల్ గా కొన్నాడే

By:  Tupaki Desk   |   15 May 2017 8:03 AM GMT
క్రైమ్ సినిమాను కూల్ గా కొన్నాడే
X
హ్యాపీ డేస్ తో తెలుగు తెరకు పరిచయమైన హీరో నిఖిల్ ఇప్పుడు ఇండస్ట్రిలో తన గుర్తింపు కోసం తన వంతు కృషి గట్టిగానే చేస్తున్నాడు. మొదటి సినిమా తరువాత సినిమా ఆఫర్లు వచ్చిన అవి ఏవి హీరో ఇమేజ్ని బలపరచలేదు. స్వామి రా రా నుండి నిఖిల్ సినీ ప్రయాణం కొత్త రూటు తీసుకుంది. రెగ్యులర్ హీరోలా కాకుండా కొంచం కొత్త కథలు ఎంచుకుంటూ వచ్చాడు.

ఇక నిఖిల్ కొత్త సినిమా కేశవ మే 19న విడుదల కావస్తుంది. ఈ సినిమా ట్రెయిలర్ విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులు నుండి కానీ ఇండస్ట్రి నుండి కానీ పాజిటివ్ టాక్ వినపడుతుంది. ఇందులో నిఖిల్ కనిపించే గెటప్ కూడా కొత్తగా ఉంది. ఇంప్రెసివ్ క్రైమ్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అతి తక్కువ బడ్జెట్లో తీశారు. షుమారుగా 3 కోట్ల వ్యయం తో నిర్మించారు హీరో డైరెక్టర్ పారితోషికం కూడా ఆ 3 కోట్లలోనే అని అంటున్నారు. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా సేల్స్ పాయింట్ తెలిస్తే మనతోం స్టన్ అవ్వాల్సిందే.

ట్రైలర్ లో కొత్తదనం ఉండటంతో.. యంగ్ హీరో శర్వానంద్ అతని బ్రదర్ కలిసి ''కేశవ'' థియేట్రికల్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అభిషేక్ పిక్చర్స బేనర్ పై విడుదల చేద్దాం అనుకున్నారు కానీ శర్వానంద్ ఇచ్చిన 4 కోట్లు ఆఫర్ టెంప్టింగ్ గా ఉండటంతో.. ఆంధ్ర ప్రదేశ్ రైట్స్ అతనికి ఇచ్చేశారట. గతంలో సినిమా తీసి దెబ్బతిన్న శర్వానంద్.. ఇప్పుడు డిస్ర్టిబ్యూషన్ చేసి కూల్ గా సక్సెస్ కొడతాడా? చూద్దాం.