Begin typing your search above and press return to search.

శ్రీకారాన్ని కూడా శర్వా లైట్ తీసుకున్నాడా?

By:  Tupaki Desk   |   6 March 2020 6:10 AM GMT
శ్రీకారాన్ని కూడా శర్వా లైట్ తీసుకున్నాడా?
X
యువహీరో శర్వానంద్ తన కెరీర్లో ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. 'మహానుభావుడు' సినిమా తర్వాత శర్వాకు ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు. శర్వా తన సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకోవడం.. అవి రిలీజ్ కావడం.. ఒక దానిని మించి మరొకటి డిజాస్టర్ కావడం సాధారణంగా మారిపోయింది. దీంతో తన రూటు కాస్త మార్చి 'జాను' లో నటిస్తే అది కూడా తీవ్రంగా నిరాశపరిచింది. కమర్షియల్ హిట్ సంగతి పక్కన పెట్టి తన నటనకు ప్రశంసలు అయినా దక్కుతాయి అనుకుంటే అదీ జరగలేదు. దీంతో శర్వాకు అభిమానులు కూడా నిరాశలో కూరుకుపోయారట.

శర్వా సినిమాల పరాజయానికి కారణం కంటెంట్ మాత్రమే కాదని.. వీక్ పబ్లిసిటీ కూడా ఒక కారణమని చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. గత సినిమాల సంగతి పక్కన పెట్టి శర్వా కొత్త సినిమా 'శ్రీకారం' గురించి మాట్లాడుకుంటే దీనిపై కూడా పెద్దగా బజ్ లేదు. పల్లెటూరి కుర్రాడిలా శర్వా లుంగీలు కట్టుకుని ఉంటే ప్రేక్షకులు ఆదరించే విషయం అనుమానమేనని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. పల్లెటూరు నేపథ్యంలో సినిమాలతో మెప్పించడం అంత సులువు కాదు. 'శతమానం భవతి' లో ఇలాంటి పాత్రే చేసినప్పటికీ ఆ సినిమాకు చాలా అంశాలు కలిసివచ్చాయి.

ప్రస్తుతం 'శ్రీకారం' పరిస్థితి అంత అనుకూలంగా లేదని అంటున్నారు. తన సినిమాలకు పబ్లిసిటీ విషయంలో చొరవ తీసుకుంటాడని.. సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తాడని ట్రేడ్ లో శర్వాపై నమ్మకం ఉంది. మరి 'శ్రీకారం' సినిమాకు ఉన్న నెగెటివ్ బజ్ ను శర్వా కంట్రోల్ చేసేందుకు చొరవ తీసుకుంటాడా లేదా దీన్ని కూడా తన లాస్ట్ సినిమాను వదిలేసినట్టు వదిలేస్తాడా అనేది వేచి చూడాలి.