Begin typing your search above and press return to search.

ఇంకో హీరోకి సాయిప‌ల్ల‌వి కోటింగ్‌

By:  Tupaki Desk   |   25 July 2018 1:35 PM GMT
ఇంకో హీరోకి సాయిప‌ల్ల‌వి కోటింగ్‌
X
ప్రేమ‌మ్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి ఇప్ప‌టికే అసాధార‌ణ స్టార్‌ డ‌మ్‌ ని ఆస్వాధిస్తోంది. ఆ క్ర‌మంలోనే సాయి ప‌ల్ల‌వి కోస‌మే క‌థ‌లు - పాత్ర‌లు రాసుకునే ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు పెరిగారు. ఈ అమ్మ‌డిపై గురేంటో తెలీదు కానీ, అస‌లు సాయి ప‌ల్ల‌వికి ఉన్న క్రేజే వేరుగా ఉంది. కెరీర్ మాట అటుంచితే, ఈ భామ వైఖ‌రి వేరే వ్య‌వ‌హారాల్లోనూ తేడానే అన్న చ‌ర్చ సాగింది. సాయిప‌ల్ల‌వి పేరు తొలి నుంచి వివాదాస్ప‌ద అంశాల్లో మార్మోగిపోతోంది. వ‌స్తూనే దిల్‌ రాజు లాంటి అగ్ర‌నిర్మాత‌తో గొడ‌వ పెట్టుకుంద‌న్న ప్ర‌చారం సాగింది.

ఇటీవ‌ల యువ‌హీరో నాగ‌శౌర్య‌తో సాయి ప‌ల్ల‌వి డిఫ‌రెన్సెస్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు ఎదురుప‌డ‌నంత సీరియ‌స్ అయ్యింది మ్యాట‌ర్‌. ఎవ‌రికి వారు ఇంట‌ర్వ్యూల్లో త‌మ మ‌ధ్య వివాదం గురించి మాట్లాడారు. సాయిప‌ల్ల‌వి యాటిట్యూడ్‌ - రూడ్ క్యారెక్ట‌ర్‌ పై పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులొచ్చాయి. ఆ ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల నాగ‌శౌర్య హ‌ర్ట‌య్యాడ‌ని, అటుపై మాట్లాడ‌డం కూడా మానేశాడ‌న్న చ‌ర్చ సాగింది. ఒకానొక సంద‌ర్భంలో శౌర్య హ‌ర్ట‌యితే తాను సారీ చెబుతాన‌ని సాయిప‌ల్ల‌వి అన‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చింది. అదంతా అటుంచితే ప్ర‌స్తుతం వేరొక హీరోతోనూ సేమ్ టు సేమ్ సీన్ రిపీటైంద‌న్న ముచ్చ‌ట సాగుతోంది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో సాయిప‌ల్ల‌వి కోల్‌క‌తాకు చెందిన‌ ఎంబీబీఎస్ విద్యార్థిగా న‌టిస్తోంది. స్వ‌త‌హాగానే కాస్త స్పీడ్‌ గా ఉండే సాయిప‌ల్ల‌వి యాటిట్యూడ్‌ కి శ‌ర్వా సైతం ఓ సంద‌ర్భంలో హ‌ర్ట‌య్యాడ‌ని మాట్లాడుకుంటున్నారంతా. శ‌ర్వా ఎంతో పొందికైన కుర్రాడు. ఎవ‌రినీ హ‌ర్ట్ చేసే స్వ‌భావం ఉన్న‌వాడు కాడు. అలాంటి హీరోనే ఫిదా బ్యూటీ అంత హ‌ర్ట్ చేసిందా? అన్న ముచ్చ‌టా సాగుతోంది. అయితే దీనిపై సాయిప‌ల్ల‌వి కానీ, లేదా శ‌ర్వానంద్ కానీ ఏదైనా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. త్వ‌ర‌లోనే ప‌డిప‌డి లేచే మ‌న‌సు రిలీజ్‌కి వ‌స్తోంది కాబ‌ట్టి ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌లో ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఈ రూమ‌ర్ నిజ‌మా.. కాదా? అన్న‌ది యూనిట్ నుంచి అయినా క్లారిటీ రావాల్సి ఉంటుంది.